5 Seater Cars: రూ. 12 లక్షలలోపు అదిరిపోయే మైలేజీతో లభించే బెస్ట్ SUV కార్లు ఇవే.. మీరూ లుక్కేయండి!

|

Mar 09, 2023 | 1:21 PM

మీరు కొత్త SUV కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మైలేజీ గురించి ఆందోళన చెందకండి. ఎందుకంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే 5-సీటర్ కార్లను ఇప్పుడు చూద్దాం. రూ.12 లక్షలలోపు 5 SUV కార్లను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవి 24kmpl వరకు మైలేజీని అందిస్తాయి.

1 / 5
టాటా నెక్సాన్: రూ. 12 లక్షల కంటే తక్కువ ధరలో లభించే SUV కార్ల గురించి మాట్లాడితే.. టాటా నెక్సాన్ మొదటి స్థానంలో ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో ఒకటైన Nexon ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలు. అదే సమయంలో రూ. 11.94 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వరకు నెక్సాన్‌కు సంబంధించిన వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ SUV కారు 24.07 kmpl ఆకట్టుకునే మైలేజీని అందిస్తోంది.

2 / 5
హోండా WR-V: హోండా VR-V అనేది సబ్-కాంపాక్ట్ SUV. మైలేజీ పరంగా కూడా ఈ కారు చాలా బాగుంటుంది. ఒక లీటర్‌కు 23.7 కిలోమీటర్లు ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వాహనానికి సంబంధించిన వివిధ వేరియంట్ల ధరలు రూ. 11.26 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

3 / 5
మారుతి గ్రాండ్ విటారా: మారుతి షానడ SUV దేశంలో అత్యంత ఎక్కువ  మైలేజీనిచ్చే SUVలలో ఒకటి. ఇది 27.97 kmpl మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.10.45 లక్షల వరకు ఉంటుంది.

4 / 5
కియా సోనెట్: దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కూడా ఎక్కువ మైలేజీని ఇచ్చే SUVని అందిస్తోంది. కియా సొనెట్ ఒక లీటర్‌కు 18.2 కిలోమీటర్లు అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.69 లక్షలు.

5 / 5
హ్యుందాయ్ వెన్యూ: హ్యుందాయ్ వెన్యూ చాలా మంచి మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.67 లక్షలు. అలాగే ఈ వాహనానికి సంబంధించిన పలు వేరియంట్లు రూ. 11.36 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ వాహనం 17.52–18.2 kmpl ఇస్తుంది.