
ఈ రోజుల్లో కొందరు చిన్న వాటికే ఏడుస్తారు. ఇంకొందరు తమ భావోద్వేగాలను లోలోపల దాచుకుని, ఎప్పుడూ కూడా బలంగా ఉన్నట్లు కనిపించడానికి ఎంతో కవర్ చేస్తుంటారు. ఏం జరిగినా కూడా చిన్నప్పటి నుండి ఎక్కువగా ఏడవకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. కానీ, ఏడిస్తేనే మంచిది అంటున్నారు.

ఏడిస్తే మన ఇంట్లో వాళ్లు ధైర్యంగా ఉండాలని అంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఏడవడం మీ బలహీనత కాదు. మనసులో చాలా బాధ, ఒత్తిడి ఉన్నప్పుడు, మనసుకు ఉపశమనం కలగడానికి మీరు ఒంటరిగా ఏడిస్తే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ మనసులో ఉన్న బాధను, భారాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

కొన్ని పరిశోధనలు తెలిపిన వివరాల ప్రకారం, ఏడుపు మీ శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు ఒక్కరే ఏడుస్తున్నప్పుడు, శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. దీని వలన మీ శరీరం కూడా రిలాక్స్ అవుతుంది నిముషాల్లోనే. అంతేకాదు మానసిక ఆరోగ్య నిపుణులు ఇదే చెబుతున్నారు.

మనకి చెమట పడితే శరీరం నుంచి కొన్ని మలినాలు ఎలా పోతాయో అలాగే ఏడవడం వలన కూడా మనసుపై కూడా భారం కూడా తగ్గుతుంది. ఒత్తిడి సమయంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతాయి. ఏడవడం భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది, దీనివల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.

(నోట్ : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు అధ్యాయనాల, మానసిక నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)