
బరువు తగ్గడానికి దొహదపడే పండ్లలో ఆపిల్ ఒకటి. యాపిల్ తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ప్రాంతంలో కొవ్వు తగ్గడానికి సహకరిస్తుంది. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు యాపిల్ తొక్కతో తినాలి. ఎందుకంటే యాపిల్ పండు తొక్కలో క్వెర్సెటిన్ అనేది ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

యాపిల్ పండ్లను తొక్కతో తినాలని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, ఆపిల్ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆకలి, తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా మీ బరువు అదుపులో ఉంటుంది. ఫైబర్ ఉండే ఆహారాలతో మీ ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

ఆపిల్ తొక్కలో విటమిన్ ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన మినరల్స్ కూడా నిండుగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తద్వారా గుండె, నరాలు, మెదడు, చర్మం, ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

ఆపిల్ తొక్కతో ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. యాపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఆపిల్ తొక్కతీసి తింటే.. ఈ ప్రయోజనాలు ఉండవు.

అంతేకాదు..ఆపిల్ తొక్కలు సహజ ఆర్ద్రీకరణతో నిండి ఉంటాయి. ఆపిల్ తొక్క సారాలు, లేదా మాస్క్లను ను ముఖానికి పెట్టడం వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఆపిల్ తొక్కల సున్నితమైన ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.