
BIS హాల్‌మార్క్ : మీరు కొనే బంగారం నిజమైనదా, కాదా అని చెప్పేది BIS హాల్‌మార్క్ మాత్రమే.. మీరు కొనే ప్రతి ముక్కపై BIS లోగో, స్వచ్ఛత సంఖ్య 6 అంకెల HUID కోడ్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ హాల్‌మార్క్ లేని బంగారాన్ని ఎప్పుడూ కొనొద్దు.

క్యారెట్‌ను బట్టే బంగారం ధర, స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. 24K అంటే స్వచ్ఛమైన బంగారం. ఇది చాలా మెత్తగా ఉంటుంది.. అందుకే నగలు చేయరు. 22K బంగారం ఆభరణాలు, నగలు చేయడానికి బెస్ట్ అని అంటారు. ఇక 18K బంగారంలో మన్నిక కోసం ఇతర లోహాలు కలుపుతారు. నగలు కొనేటప్పుడు ఇవి కచ్చితంగా అడిగి తెలుసుకోండి.

తయారీ ఛార్జీలు: నగలకు పెట్టే ధరలో తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇవి 5శాతం నుంచి 20శాతం వరకు ఉంటాయి. వీటిపై బేరం ఆడండి. 10శాతం కంటే ఎక్కువ చెల్లించకుండా ప్రయత్నించండి. మీరు బంగారు నాణేలు లేదా బార్‌లు కొంటే ఈ ఛార్జీలు చాలా తక్కువగా లేదా అసలు ఉండవు.

తూకం, బిల్లు పక్కాగా: మీ కళ్ల ముందే డిజిటల్ స్కేల్‌లో తూకం వేయాలి. మీరు డబ్బు కట్టిన తర్వాత ఇచ్చే బిల్లులో స్వచ్ఛత, బరువు, HUID నంబర్, తయారీ ఛార్జీలు, 3శాతం జీఎస్టీ వివరాలు కచ్చితంగా ఉన్నాయో లేదో చూసుకోండి. బిల్లు లేకపోతే ఇబ్బందుల్లో పడతారు..

నమ్మకమైన షాప్‌లోనే : BIS సర్టిఫైడ్ ఉన్న పెద్ద, పేరున్న జ్యువెలరీ షాపుల నుంచే కొనండి. పెద్ద బ్రాండ్లు పారదర్శకత మరియు సరైన డాక్యుమెంటేషన్‌ను పాటిస్తాయి. చిన్న, కొత్త షాపులలో మోసం జరిగే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా బంగారం కొనేముందు ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ నియమాలను పాటించడం ద్వారా బంగారం కొనుగోలును సురక్షితంగా, స్మార్ట్‌గా చేసుకోండి.