
అరిటాకు బంగారు తీగ చేప కూరకు కావలసిన పదార్థాలు: అరకిలో బంగారు తీగ చేపలు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర , మూడు అరిటాకులు

ముందుగా చేపలను క్లీన్ చేసుకోవాలి: బంగారు తీగ చేపలను తీసుకుని వాటిని బాగా కడిగి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వీటికి జోడించి 15 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే వాసనను తగ్గించి మంచి రుచిని ఇస్తుంది. కాబట్టి , మీరు కూడా ఇలాగే చేయండి.

చేప ముక్కలకు మసాలాలు పట్టించుకోవాలి: చేపలకు ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటికి బాగా పట్టించాలి. అలాగే, 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే రుచికి ఉంటుంది.

అరిటాకును తీసుకుని దానిలో మ్యారినేట్ చేసిన చేప ముక్కలను పెట్టి దాని మీద కరివేకులు కూడా వేసి వాటిని మడిచి పాన్ మీద పెట్టాలి. వీటిని 10 నిముషాల పాటు పొయ్యి మీదే ఉంచాలి. అయితే, మధ్యలో ఒకసారి వీటిని తిప్పుతూ ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా ఉడికేలా చేయాలి. అరిటాకు వలన లోపల ఉన్న చేప త్వరగా ఉడికిపోతోంది.

ఈ కూరకు నూనె చుక్క కూడా అవసరం లేదు ఎందుకంటే, చేపలో ఉన్న తేమతోనే బాగా ఉడికిపోతుంది. ఇంకా అరిటాకును వాడటం వలన దీనికి ప్రత్యేకమైన వాసన, టేస్ట్ వస్తుంది. అలాగే, దీనిని హై మంటపై వండకండి. అలా చేస్తే అరిటాకు మాడిపోయే అవకాశం ఉంది. ఈ చేప కూరను రైస్‌తో కానీ రోటితో తింటే రుచి అదిరిపోతోంది.