
అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినకూడదు. అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే, అరటిపండ్లు, పాలు ఎప్పుడూ కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక మీ ఆరోగ్యానికి హానికరం. అరటిపండ్లు తిన్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కలిగిస్తాయి.

అరటిపండ్లు తిన్న తర్వాత తీపి పదార్థాలు కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లు తిన్న తర్వాత వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మధుమేహం లేకపోయినా అరటి పండు తర్వాత స్వీట్స్ తినకూడదని చెబుతున్నారు.

అంతేకాదు.. రాత్రిపూట కూడా అరటి పండును అస్సలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. బనానా తిన్న తర్వాత వేయించిన పదార్థాలు తినకూడదు. కారంతో చేసిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కాఫీలు, టీలు బనానా తిన్నాక తాగడం మానేయాలి. దీని వల్ల జీర్ణసమస్యలు , అలెర్జీలు, ముఖంపై మచ్చలు వస్తాయి.

అలాగే అరటిపండు తిన్న తర్వాత కాఫీ తాగకూడదు. ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. రాత్రిపూట సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు.

బంగాళదుంప, అరటి పండును కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే ఈ రెండిండి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.