
జ్యోతిష్యశాస్త్రంలో సూర్య, చంద్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని గ్రహాల రాజుగా పిలుస్తారు. ఇక గ్రహాలు రాశులను మార్చుకోవడం అనేది చాలా కామన్. ముఖ్యంగా సూర్యుడు ప్రతి నెలా తన రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. దీంతో దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే ఈ జూన్ 20న సూర్యుడు అరుణ్ ద్విద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. సూర్యుడు చంద్రుడికి 30 డిగ్రీల దూరం రావడంతో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి సూర్యుడు-అరుణ ద్విద్వాదశ యోగం వలన కర్కాటక రాశి వారి జీవితంలో కొత్త వెలుగులు రానున్నాయి. ఈ యోగం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో అరుణుడు పదకొండవ ఇంట్లో ,సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల వీరికి ఆర్థికంగా, అవకాశాల పరంగా అద్భఉతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కన్యా రాశి : ద్విద్వాదశ యోగం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారు అన్ని పనుల్లో పురోగతి సాధిస్తారు. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు మంచి లాభాలు పొందుతారు. కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు. అంతే కాకుండా జీతాలు పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది.

సింహ రాశి : ద్విద్వాదశ యోగం వలన కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేసినా అందులో వీరు విజయం సాధిస్తారు. ఈ రాశిలో సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, అనేక ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. జీవితం ఆనందంగా ఉంటుంది.

వృశ్చిక రాశి : ద్విద్వాదశ రాజయోగం వలన వృశ్చికరాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. ఊహాకందని లాభాలు పొందుతారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అన్ని విధాల కలిసి వస్తుంది. అంంతే కాకుండా పెట్టుబడులకు ప్రయత్నం చేసే వారు మంచి లాభాలు పొందుతారు.