
వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, దోసెడు నెయ్యి కలుపుకు తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యితో ఎలాంటి సమస్య లేదు. కానీ మార్కెట్లో రకరకాల నెయ్యి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అసలు ఏదో.. కల్తీ ఏదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వు, మినరల్ ఫ్యాట్, స్టార్చ్ వంటి ఇతర పదార్దాలను కలిపి కల్తీ నెయ్యి యదేచ్ఛగా అమ్ముతుంటారు. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా.. కాదా అనే విషయం తేలిగ్గా గుర్తించొచ్చు.

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నెయ్యి అమృతంగా పనిచేస్తుంది. దేశీ నెయ్యి కంటి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీ నెయ్యి మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పార్కిన్సన్స్, చిత్తవైకల్యం వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.

కల్తీని గుర్తించేందుకు మార్కెట్ నుంచి తెచ్చే నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే కల్తీ అని అర్థం. నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు చేతికి కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. సువాసనగా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి. కొంత సమయం తర్వాత నెయ్యి వాసన పోతే అది కల్తీ నెయ్యి.

మీరు మీ ఎముకలను బలోపేతం చేయాలనుకుంటున్నారా..? కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే, రోజుకు ఒకటి, రెండు టీస్పూన్ల దేశీ నెయ్యిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి.

పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దేశీ నెయ్యి ప్రభావవంతంగా ఉంటుంది. మలబద్ధకం, మూలవ్యాధి వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడానికి దేశీ నెయ్యిని ప్రతిరోజూ తీసుకోవాలి. మీ శరీర శక్తి, జీవక్రియను పెంచడానికి దేశీ నెయ్యిని తీసుకోవడం మంచిది.