మీరు తింటున్న ఖర్జూరాలు అసలైనవేనా.. నకిలీ డేట్స్‌ను ఇంట్లోనే ఇలా గుర్తించండి..

Updated on: Jul 26, 2026 | 9:55 AM

ఐరన్, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, అనేక రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండే ఖర్జూరాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే వీటికున్న ఆదరణను ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో కొందరు వ్యాపారులు నాసిరకం, కెమికల్స్ కలిపిన నకిలీ ఖర్జూరాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సాధారణ ఖర్జూరాలకు రసాయనాలు, కృత్రిమ రంగులు, చక్కెర పాకం పూసి ఎక్కువ ధరలకు ప్రీమియం క్వాలిటీ' పేరిట విక్రయిస్తున్నారు. మరి మనం కొనుగోలు చేసే ఖర్జూరాలు అసలైనవో కాదో ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1 / 6
కృత్రిమ తీపి - జిగట: అసలైన ఖర్జూరంలో తీపి సహజ సిద్ధంగా ఉంటుంది. కానీ నకిలీ లేదా నాసిరకం ఖర్జూరాల బరువు పెంచడానికి, తీపిని ఎక్కువ చేయడానికి వాటిని చక్కెర పాకం లేదా బెల్లం నీళ్లలో నానబెడతారు. ఇలాంటి ఖర్జూరాలను పట్టుకున్నప్పుడు చేతులకు విపరీతమైన జిగట అంటుకుంటుంది. తింటున్నప్పుడు సహజమైన రుచి కాకుండా తీవ్రమైన తీపి అనిపిస్తుంది.

2 / 6
అతిగా మెరిసే రంగు: సాధారణ ఖర్జూరాలు కొద్దిగా పొడిగా, సహజమైన గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. కానీ మార్కెట్లో కొన్ని ఖర్జూరాలు బాగా మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నాసిరకం ఖర్జూరాలు కొత్తవిగా కనిపించడానికి వాటిపై మినరల్ ఆయిల్, గ్లిజరిన్ లేదా మైనం వంటివి పూస్తారు. అతిగా మెరుస్తున్న ఖర్జూరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

3 / 6
ఈగలు - పురుగుల ప్రవర్తన: చక్కెర పాకం పోసిన పదార్థాలపై ఈగలు, కీటకాలు త్వరగా వాలుతాయి. అయితే కెమికల్స్ లేదా వ్యాక్స్ కోటింగ్ ఇచ్చిన నకిలీ ఖర్జూరాలపై ఈగలు వాలవు. ఒకవేళ మీరు మార్కెట్లో ఖర్జూరాలు కొనేటప్పుడు అవి జిగటగా ఉండి కూడా వాటిపై ఈగలు వాలకుండా ఉంటే, వాటిపై రసాయనాలు వాడారని అర్థం చేసుకోవచ్చు.

4 / 6
నీటి పరీక్ష : మీరు తెచ్చిన ఖర్జూరం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఒక సులభమైన పరీక్ష చేయవచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీటిలో 2-3 ఖర్జూరాలను వేసి 10-15 నిమిషాలు ఉంచండి.
నీటి రంగు మారినా లేదా నీటిపై రంగు, జిగట పొరలా తేలినా అవి నకిలీవి. అసలైన ఖర్జూరాల రంగు నీటిలో అంత సులభంగా కరిగిపోదు. అంతేకాకుండా నమిలినప్పుడు దాని తొక్క, లోపలి గుజ్జు కలిసిపోతాయి. కానీ నకిలీ లేదా కెమికల్స్ వాడిన ఖర్జూరాలలో పై పొర ప్లాస్టిక్‌లా గట్టిగా ఉండి, గుజ్జుతో కలవకుండా వేరుగా వస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

నీటి పరీక్ష : మీరు తెచ్చిన ఖర్జూరం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఒక సులభమైన పరీక్ష చేయవచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీటిలో 2-3 ఖర్జూరాలను వేసి 10-15 నిమిషాలు ఉంచండి. నీటి రంగు మారినా లేదా నీటిపై రంగు, జిగట పొరలా తేలినా అవి నకిలీవి. అసలైన ఖర్జూరాల రంగు నీటిలో అంత సులభంగా కరిగిపోదు. అంతేకాకుండా నమిలినప్పుడు దాని తొక్క, లోపలి గుజ్జు కలిసిపోతాయి. కానీ నకిలీ లేదా కెమికల్స్ వాడిన ఖర్జూరాలలో పై పొర ప్లాస్టిక్‌లా గట్టిగా ఉండి, గుజ్జుతో కలవకుండా వేరుగా వస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

5 / 6
పురుగులు - లోపలి భాగం: కొన్నిసార్లు పాతబడిపోయిన లేదా బూజు పట్టిన ఖర్జూరాలను కెమికల్స్ వాషింగ్ చేసి కొత్తవాటిలా అమ్ముతారు. కాబట్టి ఖర్జూరం కొనేముందు దాన్ని సగానికి తుంచి చూడండి. లోపల నల్లటి పొడి, బూజు లేదా చిన్న పురుగులు ఉన్నట్లయితే వాటిని అస్సలు తినకూడదు. నకిలీ ఖర్జూరాలలో వాడే ఆర్టిఫిషియల్ స్వీటనర్లు, కెమికల్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి తీవ్ర ప్రమాదకరం. అలాగే కడుపునొప్పి, జీర్ణక్రియ సమస్యలు, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

6 / 6
ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?:  వీలైనంత వరకు రోడ్డు పక్కన లేదా లూజ్‌గా అమ్మే ఖర్జూరాలను కొనకపోవడమే మంచిది. సీల్ చేసిన ప్యాకెట్లు, ఎక్స్‌పైరీ డేట్, FSSAI గుర్తింపు ఉన్న బ్రాండెడ్ ఉత్పత్తులనే ఎంచుకోండి. అతి తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని ఖర్జూరాలను కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. ఆరోగ్యం కోసం మనం తినే ఆహారం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడం మన బాధ్యత.

Follow Us