
చలికాలం మొదలయ్యిదంటే చాలు తల తిరుగుడు సమస్యతో ఎంతో మంది బాధ పడుతుంటారు. ఉదయం లేవడంతోనే కింద పడిపోతుంటారు. ఇంకొందరికి అయితే తలనొప్పి కూడా బాగా వస్తుంది.

సరైన నిద్ర లేకపోవడం : రాత్రిపూట లేట్ గా పడుకున్నప్పుడు మీ మెదడు పనితీరు మందగిస్తుంది. ఎందుకంటే, అప్పటి వరకు లైట్ ను చూస్తూ ఉంటారు దీని వలన నిద్ర సరిగా పట్టక తల తిరుగుతుంది.

విటమిన్ డి లోపం: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కూడా ఉదయం లేవగానే పడి పోతుంటారు. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

మానసిక ఒత్తిడి: అతిగా ఆలోచించినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. టెన్షన్, ఒత్తిడి వలన నిద్ర పట్టదు దీని వలన తల తిరగడం మొదలవుతుంది.

నీరు తక్కువగా తీసుకోవడం: నీరు తక్కువగా తీసుకున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన నీరు తీసుకోవాలి.