
ప్రోటీన్ లెక్క ఇది : నోయిడాలోని నిదాన్ మదర్ అండ్ చైల్డ్ కేర్ శిశువైద్యుడు డాక్టర్ రాజీవ్ రంజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రోటీన్ శోషణ విషయంలో ఉడికించిన గుడ్లదే పైచేయి. వీటిని తిన్నప్పుడు మన శరీరం అందులోని ప్రోటీన్‌ను 90 శాతం వరకు గ్రహించగలదు. పచ్చిగా తీసుకున్నప్పుడు శరీరం కేవలం 50 శాతం ప్రోటీన్‌ను మాత్రమే గ్రహిస్తుంది. అంటే మీరు పచ్చి గుడ్లు తింటే సగం ప్రోటీన్ వృధా అవుతుందన్నమాట.

సాల్మోనెల్లా బ్యాక్టీరియా: పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పికి దారితీస్తుంది.

బయోటిన్ లోపం: పచ్చి గుడ్లలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరం విటమిన్ బి7ను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. గుడ్డును ఉడికించడం వల్ల ఈ అవిడిన్ నాశనం అవుతుంది.

జీర్ణ సమస్యలు: పచ్చి గుడ్లు తింటే వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవ్వడం చాలా సాధారణం. అంతేకాకుండా గుడ్లలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి, బి12, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వ్యక్తి వయస్సు, బరువు, వాతావరణాన్ని బట్టి గుడ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి.

గుడ్లు సహజంగా వేడిని కలిగిస్తాయి కాబట్టి వేసవిలో వీటి పరిమాణాన్ని పరిమితం చేయడం మంచిది. పూర్తి పోషకాలు అందాలంటే గుడ్లను ఎల్లప్పుడూ ఉడకబెట్టి లేదా వండి మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.