10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో లక్షలు గడిస్తున్న యువరైతు!

Updated on: Oct 12, 2026 | 10:34 AM

Gac Fruit Farming: కరోనా సమయంలో ఓ యువకుడికి వచ్చిన ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది. అంతా ఉద్యోగాల కోసం పట్టణాల బాట పడుతుంటే, ఏపీకి చెందిన ఈ యువకుడు మాత్రం నగరంలోని ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు. వ్యవసాయాన్నే జీవనాధారంగా ఎంచుకుని, తనకున్న పొలంలో ఓ విదేశీ పంటను సాగు చేస్తూ ప్రస్తుతం లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు. పంట వేసిన కేవలం 4 నెలల్లోనే రూ.16 లక్షల రాబడితో అద్భుతం సృష్టించాడు. మార్కెట్లో కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పలికే గ్యాక్ ఫ్రూట్ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి. శేషుబాబు.

1 / 6
2020లో హైదరాబాద్‌లో సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న శేషుబాబు, కరోనా పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి వచ్చాడు. తొలుత కుటుంబంతో కలిసి మిర్చి సాగు చేశాడు. అయితే వాతావరణ మార్పుల వల్ల ఆ పంట తీవ్రంగా దెబ్బతినడంతో, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా ఆగ్నేయాసియా దేశాల్లో బాగా ప్రసిద్ధి చెందిన గ్యాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. మార్కెట్లో ఈ పండుకు మంచి డిమాండ్ ఉందని గ్రహించి, దీని సాగు చేపట్టాలని భావించాడు.

2 / 6
ఏపీలోని ఓ నర్సరీ వియత్నాం నుంచి తెప్పించిన ఈ మొక్కలను విక్రయిస్తుండటంతో, మార్చి 2023లో పావు ఎకరం విస్తీర్ణంలో ఒక్కో మొక్కను రూ.700 చొప్పున కొనుగోలు చేసి 100 మొక్కలు నాటాడు. నాటిన నాలుగు నెలలకే పంట చేతికొచ్చింది. తొలి కోతలోనే 100 మొక్కల నుంచి ఏకంగా 2,100 కిలోల దిగుబడి వచ్చింది. మార్కెట్లో కిలో రూ.800 చొప్పున విక్రయించడంతో మొదటిసారే రూ.16 లక్షల ఆదాయం లభించింది.

3 / 6
పంట విస్తరణ: తొలి ప్రయత్నంలోనే విశేష లాభాలు రావడంతో సాగును 75 సెంట్లకు పెంచి మరో 300 మొక్కలు నాటాడు. వీటిలో 210 ఆడ మొక్కలు, 90 మగ మొక్కలు ఉన్నాయి. ఆడ మొక్క సగటున 30 కిలోల కాయలను ఇస్తుంది. అధిక దిగుబడి సాధించాలంటే వీటికి చేతితో పరాగసంపర్కం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతోనే మార్కెట్లో ఈ పండు ధర అధికంగా ఉంటుంది.

4 / 6
సాగు ఖర్చు, మార్కెటింగ్: ఎకరం భూమిలో సుమారు 400 నుంచి 450 వరకు మొక్కలను నాటవచ్చు. పాదులు పాకడానికి పందిరి నిర్మాణం అవసరం కాగా, ఎకరానికి ఇందుకు దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఉద్యానవన శాఖ నుంచి రూ.1 లక్ష సబ్సిడీ కూడా లభిస్తుంది. ఎకరానికి 5 టన్నుల దిగుబడి సాధించి, కిలో రూ.150 చొప్పున విక్రయించినా ఖర్చులు తీసివేయకముందు రూ.7.5 లక్షల రాబడి వస్తుందని శేషుబాబు చెబుతున్నారు.

5 / 6
సహజసిద్ధమైన పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం: ఈ పంట సాగుకు రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులను పాటిస్తున్నారు. ఘన జీవామృతం, నిమ్మకాయ-గుడ్డు మిశ్రమం, చేపలు-బెల్లం ద్రావణం, మజ్జిగ వంటి సహజసిద్ధ ఎరువులను క్రమ పద్ధతిలో అందిస్తున్నారు. గ్యాక్ ఫ్రూట్‌తో పాటు డ్రాగన్ ఫ్రూట్, జామ, బొప్పాయి, నిమ్మ, యాపిల్ బేర్, ఆకాకర వంటి ఇతర పంటలను కూడా ఆయన సాగు చేస్తున్నారు.

6 / 6
గ్యాక్ ఫ్రూట్ ప్రత్యేకతలు: ఈ పండులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల దీనిని సూపర్‌ఫ్రూట్ అంటారు. టమాటాల్లో ఉండే లైకోపీన్‌తో పాటు, శరీరానికి విటమిన్-ఎ అందించే బీటా-కెరోటిన్ ఇందులో మెండుగా లభిస్తాయి. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు, పక్వానికి వచ్చేకొద్దీ పసుపు, నారింజ, ఎరుపు రంగులోకి మారుతుంది. పచ్చిగా ఉన్నప్పుడూ వీటిని కూరల్లో, పండాక నేరుగా కూడా తినవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us