Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

Updated on: Jul 21, 2026 | 2:02 PM

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాబట్టి రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంబోతున్నాయో తెలుసుకుందాం.

1 / 5
ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

2 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు: వాతావరణ శాఖ ప్రకారం.. మంగళ, బుధవారాల్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే వర్షాలు కరిసే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంది.

3 / 5
దక్షిణకోస్తా ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు: ఈ జిల్లాలో మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక గురువారం వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని స్పష్టం చేసింది.

4 / 5
రాయల సీమలో వర్షాలు: ఇక రాయలసీమలోనూ రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళ, బుధవారంలో వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో, గురువారం గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

5 / 5
అలాగే వర్షాల పట్ల ప్రమత్తంగా ఉండాలని రైతులక కొన్ని సూచనలు చేసింది వాతావరణ శాఖ. వర్షాలు కురిసే సమయంలో ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గర్లో ఉండకూడదని సూచింది. అలాగే రైతులు పోలాలకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగిపడితే..విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Follow Us