ఉసిరి వీరికి విషంతో సమానం.. పొరబాటున ముట్టుకున్నారో నేరుగా కైలాసానికే!

Updated on: Mar 22, 2026 | 1:11 PM

ఆరోగ్య స్పృహ ఉన్నవారు చాలా మంది తమ ఉదయాన్ని గ్లాసుడు ఉసిరి రసంతో ప్రారంభిస్తారు. ఆయుర్వేదంలో ఉసిరితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండు, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరి తీసుకోవడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

1 / 5
ఆరోగ్య స్పృహ ఉన్నవారు చాలా మంది తమ ఉదయాన్ని గ్లాసుడు ఉసిరి రసంతో ప్రారంభిస్తారు. ఆయుర్వేదంలో ఉసిరితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండు, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరి తీసుకోవడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
ఉసిరి సాధారణంగా చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇప్పటికే తక్కువ రక్త చక్కెర స్థాయిలు (హైపోగ్లైసీమియా) ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే ప్రమాదంలో పడతారు. ముఖ్యంగా మధుమేహం కోసం మందులు తీసుకుంటున్న వారికి చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది.

3 / 5
ఉసిరిలో పొటాషియం, ఆక్సలేట్ పుష్కలంగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారికి లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ పండు చాలా ప్రమాదకరం. ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ధోరణిని మరింత పెంచుతుంది. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది.

4 / 5
అలాగే శస్త్రచికిత్స జరిగినవారు లేదా జరగబోయేవారు ఉసిరికాయకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉసిరికాయ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. దీని ఫలితంగా శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. వైద్యుల ప్రకారం ఏదైనా శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు ఉసిరికాయ తినడం మానేయాలి.

5 / 5
ఉసిరి పుల్లగా, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. గుండెల్లో మంట లేదా జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల అసౌకర్యం పెరుగుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ, కడుపులో పుండ్లతో బాధపడేవారికి దీనిలోని అధిక ఆమ్లం బాధాకరంగా ఉంటుంది. ఉసిరి కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ దీనిని అల్లం లేదా మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్‌లపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కాలేయ పనితీరును తగ్గించగలదని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us