చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా మార్కెట్‌లో దొరుకుతాయి. సాధారణంగా చాలా మంది ఉసిరిని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చర్మ సమస్యను తొలగించడానికి కూడా ఆమ్లా పనిచేస్తుంది.
వీటిని పచ్చళ్లు, ఆమ్లా మురబ్బా ఇలా పలు స్పెషల్ వంటకాలను చేసి తింటారు. అయితే, కొన్ని వ్యాధులతో బాధపడుతున్నవారు పొరపాటున కూడా ఉసిరిని తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఉసిరిని ఎవరు తినకూడదు.. తింటే ఏమవుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లో బ్లడ్ షుగర్: రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉసిరిని తీసుకుంటే, అది చక్కెర స్థాయిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ఉసిరికి దూరంగా ఉండాలని.. వైద్యుల సలహాతో తినవచ్చని పేర్కొంటున్నారు.
జలుబు - దగ్గు : జలుబు, దగ్గు కారణంగా నోటి రుచి మంచిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చాలామంది ఉసిరిని తింటారు. వాస్తవానికి జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ఉసిరి తినకూడదు. ఎందుకంటే ఉసిరి చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కావున దానికి దూరంగా ఉండటమే బెటర్.
పొత్తికడుపు వాపు విషయంలో: ఎప్పుడూ ఏదో ఒక కారణం వల్ల కడుపులో వాపు సమస్య వస్తుంటుంది. అలాంటి వారు ఉసిరికాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే ఉసిరికాయ వినియోగం మీ సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం మానుకోండి.
కిడ్నీ సమస్య: ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే, ఉసిరికాయను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతుంది. సోడియం మొత్తాన్ని పెంచడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల, మీరు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని తినకండి.