Amla Chia Seeds Water: ఉసిరి రసంలో చియా గింజలు వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..? ఊహించని మార్పులు..

|

Jan 10, 2025 | 8:35 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. చలికాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పరంగా ప్రమాదకరం. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఉదయం కొన్ని ప్రత్యేక మూలికలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో భాగంగా ఉసిరి రసం, చియా సీడ్స్ కలిపి తీసుకోవాలంటున్నారు నిపుణులు.. లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి, చియా గింజలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది. ఉసిరి, చియా గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, జీవక్రియను పెంచి, రోగనిరోధక శక్తి బలపడుతుంది.

2 / 5
ఆయుర్వేదం ప్రకారం, ఉసిరి మూడు దోషాలను వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేసే ఔషధ గుణాలు కలిగిన మూలిక. దీన్ని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇందులో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

3 / 5
ఉసిరి, చియా గింజలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచివే. అయితే ఉసిరి రసంలో చియా గింజలు వేసుకొని తాగితే మరింత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసం చియా విత్తనాలు కలిపి తాగడం వల్ల జీర్ణ క్రియ బాగుంటుంది. చియాలోకి ఫైబర్, ఉసిరిలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్తేజ పరిచే గుణం ఉంటాయి.

4 / 5
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉసిరి రసం చియా గింజలను కలిపి తాగాల్సిందే. చియా గింజలు కడుపు ఫుల్ అయ్యేలా చేస్తుంది. అటు ఉసిరి జ్యూస్ కొవ్వును కరిగిస్తుంది. ఉసిరి రసం చియా గింజల్లో రోజువారీ మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. దీనిని రోజూ తాగడం చాలా మంచిది

5 / 5
చియా గింజలు ఉసిరి రసంలోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరిగి చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఉసిరి చియా మిశ్రమంలోని యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చియా ఉసిరి రసం తాగడం వల్ల శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఉసిరి రసం చియా గింజల మిశ్రమాన్ని చలికాలంలోనే కాదు ఎప్పుడైనా తీసుకోవచ్చు.