
వేయించిన శనగల గురించి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎవరూ వీటిని పెద్దగా తినడం లేదు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మాత్రం పిల్లలకు ఇవే స్నాక్స్. సాయంత్రం అయ్యిందంటే కొన్ని గిన్నెలో వేసుకుని తినేవారు. వీటితో చాట్ వంటి రెసిపీలు కూడా తయారు చేసుకోవచ్చు.

శనగపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు మంచి ఆహారంగా పరిగణించబడుతుంది. శనగపప్పులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన శనగపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకల బలహీనత తొలగిపోతుంది.

వేయించిన శనగలు తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో మెగ్నీషియం, పొటాషియం వంటివి లభిస్తాయి. ఇవి రక్త పోటును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో గుండె పని తీరు మెరుగు పడుతుంది.

నానబెట్టిన శనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే లేదా శారీరక పని చేసే వారికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

నానబెట్టిన శనగపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపును శుభ్రపరుస్తుంది.