JAPATRI Flower: ఇది ఫ్లవరే కదా..! అనుకుంటే పొరపాటే.. పవర్‌ తెలిస్తే పరేషన్‌ అవ్వాల్సిందే..!!

|

Oct 20, 2024 | 12:34 PM

ఆయుర్వేదంలో జాజికాయ, జాపత్రీని అనేక వ్యాధులలో ఔషధంగా ఉపయోగిస్తారు. డయేరియా, వాంతులు, పొట్టనొప్పి, గ్యాస్‌ సమస్యలతోపాటు నిద్రలేమి, మూత్రపిండ సమస్యలు, దగ్గు... ఇలా ఎన్నో వ్యాధుల చికిత్సలో ఈ రెండింటినీ వాడుతుంటారు. అయితే, ఇక్కడ మనం జాపత్రితో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం..

1 / 5
మాంసాహార వంటల్లోనూ బిర్యానీల్లోనూ మసాలాద్రవ్యాలు తప్పనిసరిగా వాడుతాం..  అప్పుడే ఆ వంటకాలకు అంత రుచి అందుతుంది. ఆ ఆహారాలు అంతలా గుబాళిస్తాయి. ఆ కోవకే చెందినదే జాపత్రీ. ఇది చూసేందుకు ఓ పువ్వులా కనిపిస్తుంది. కానీ, జాజికాయని ఓ లేసుపొరలా చుట్టుకుని ఉండే సుగంధ ద్రవ్యం. అయితే, ఈ రెండింటి రుచీ ఒకేలా ఉండదు.

2 / 5
జాజికాయ మట్టి రుచితో కూడిన ఘాటైన తీపి వాసనతో ఉంటే, జాపత్రి మిరియం ఘాటు కలిసిన తీపి రుచితో గుబాళిస్తుంది. దేని ఫ్లేవర్‌ దానిదే. అందుకే ఇవి రెండు రకాల మసాలాద్రవ్యాలుగా వాడుకలోకి వచ్చాయి. రెండింటినీ మసాలా వంటకాలతోపాటు స్వీట్లూ బేకరీ ఉత్పత్తులూ సాసేజ్‌లూ పుడ్డింగుల తయారీలో వాడుతుంటారు.

3 / 5
ఎరుపు నుంచి నారింజ రంగులో దారపు పోగుల్లా ఉండే జాపత్రినే జావిత్రి అనీ కూడా అంటారు. ఆస్తమా, జలుబు, దగ్గు ఫ్లూజ్వరాలకి కారణమైన వైరస్‌లతో పోరాడే గుణం ఉండటంతో దీన్ని ఆయా టానిక్కుల్లో వాడతారు. బీపీనీ తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యానికీ జాపత్రి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుంది.

4 / 5
కిడ్నీల్లోని రాళ్లను కరిగించే గుణం జాపత్రీకి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జాపత్రిలోని యూజెనాల్‌ పంటినొప్పికి మంచి మందు. ఇందులోని మేస్‌లిగ్నన్‌ నాడీకణాలను ప్రేరేపించడం ద్వారా ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. అందుకే ఈ రెండింటినీ పొడి రూపంలో సూప్‌లూ టీ కాఫీల్లోనూ, పండ్లమీద చల్లుకునీ తినొచ్చు.

5 / 5
జాపత్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాదు, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండే విధంగా సహకరిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో జాపత్రి అద్భుతమైనది.