
బార్లీ వాటర్‌లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగు చేస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా ఎక్కువ టైమ్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా, వ్యాయామం చేస్తూ బార్లీ నీరు తీసుకోవటం ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.

బార్లీలోని ఫ్రీ-రాడికల్ లక్షణాలతో పాటు, విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందులోని ఫైబర్, పేగు కదలికలకు, జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి బార్లీ నీటిలో కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

బార్లీ నీరు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బార్లీ నీరు తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. ఇది ముధుమేహం ఉన్నవారికి ప్రయోజనకంగా ఉంటుంది. బార్లీ నీరు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా బార్లీలోని ఫైబర్ కంటెంట్ సహాయపడుతుంది. ఇది క్యాలరీలను తగ్గించేందుకు, బరువును తగ్గించేందుకు ముందుంటుంది.

బార్లీ నీరు మూత్రపిండాలలో రాళ్లకు సహజ నివారణగా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి బార్లీలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సహకరిస్తాయి. పోషకాలతో నిండిన బార్లీ నీటిని తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటానికి వీలుంటుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది.

బార్లీలో ఫెరులిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కణతులు పెరగకుండా చేస్తుంది. బార్లీలో లభించే యాంటీఆక్సిడెంట్ల ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్ కణాలు పునరుత్పత్తి జరగకుండా నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.