సుగంధ ద్రవ్యాల్లో ఏలకులు కూడా ఒకటి.. ఏలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వీటిని వంటల్లో వేయడం ద్వారా.. వాటి రుచి సువాసన రెట్టింపవుతుంది.. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే.. డైలీ డైట్ లో యాలకులను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏలకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఈ సమ్మేళనాలు కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి, వాపును తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులు రక్తపోటును తగ్గిస్తాయి.. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తుంది.. బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఏలకులు తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్ వంటి పరిస్థితులతో పోరాడటంతో పాటు నోటి, గుండె, కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. డైలీ రెండు ఏలకులు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..