
హెల్త్‌లైన్ ప్రకారం, దానిమ్మ గింజల్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. వాటిలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఫినాలిక్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. దానిమ్మ గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వాపును నియంత్రించడానికి, రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ చిన్న, జ్యుసి విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి మెదడు కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. దానిమ్మ గింజలు నమలడం ద్వారా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే దంతాలు తెల్లగానూ తయారవుతాయి. నోటి దుర్వాసన దూరమవుతుంది.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరగడానికి దానిమ్మ పండ్లు బాగా సహాయపడతాయి. అంతే కాక స్పెర్మ్ నాణ్యత కూడా మెరుగుపడుతుంది. దానిమ్మలో ఐరన్ ఎక్కువగా

Pomegranate

దానిమ్మలో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రేగులలో మంటను నియంత్రిస్తాయి. దానిమ్మపండు తినడం మలబద్ధకానికి చికిత్స చేయడానికి, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది. ఎందుకంటే దానిమ్మ రసం బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.