
లిచి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. లిచి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

లిచీ పండ్లలో విటమిన్ సీ, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫొలేట్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. గట్ హెల్త్ కూడా బాగుంటుంది. మలబద్ధకం సమస్య ఉండదు. లిచి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

అలాగే కొంతమంది ఒకేసారి ఎక్కువ లీచీలను తినేస్తుంటారు. కానీ ఇలా అతిగా తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం, కడుపు సమస్యలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. అందువల్ల రోజుకు 10-15 లిచీల కంటే ఎక్కువ తినకూడదు.

లిచి పండ్లు రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉండే కాపర్, ఐరన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడతాయి. బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. పైగా ఇందులో సోడియం కూడా తక్కువగా ఉంటుంది.

లిచీలో 82 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి కూడా అనేక ప్రయోజనకరంగా ఉంటుంది. లిచీలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.