
నాగ్‌పూర్ నగరం నడిబొడ్డున ఉన్న నాయక్ సరస్సు సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సరస్సులో గత కొన్ని నెలలుగా పెద్ద తాబేలు ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ తాబేలును రక్షించేందుకు నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నాగ్‌పూర్ నగరం నడిబొడ్డున ఉన్న నాయక్ సరస్సు పునరుద్ధరణ జరుగుతోంది. ఈ సరస్సులో గత కొన్ని నెలలుగా పెద్ద తాబేలు ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. నాగ్‌పూర్‌లోని నాయక్ సరస్సు మరమ్మతుల్లో భాగంగా అతిపెద్ద తాబేలు బయటపడింది. దాదాపు 120 కిలోల బరువున్న తాబేలును చూసేందుకు జనం పోటెత్తారు.

కానీ సరస్సులో నీరు, పూడిక కారణంగా అది కుదరలేదు, ఇప్పుడు వేసవి కారణంగా సరస్సులో నీరు ఎండిపోవడంతో తాబేలు స్పష్టంగా కనిపించింది. కానీ బురద కారణంగా ఆ తాబేలును పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

స్థానిక పౌరుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా తాబేలును రక్షించారు. ఈ మెత్తటి పెంకులు గల తాబేలు దాదాపు 120 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తాబేలును రక్షించి సెమినరీ హిల్స్‌లోని ట్రాన్సిట్ సెంటర్‌లో ఉంచామని, చెరువు పునరుద్ధరణ అనంతరం మళ్లీ అదే చెరువులో వదులుతామని యంత్రాంగం తెలియజేసింది. ఇంత పెద్ద తాబేలు ఈ సరస్సు వద్దకు ఎలా వచ్చిందనేది కూడా పరిశోధనాంశమే.