
ఈ సీజన్‌లో త్వరగా పండే కూరగాయల ప్రస్తావన రాగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది క్యాలీఫ్లవరే. ఎందుకుంటే చలికాలంలో వీటిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. వీటిని పెంచడానికి సరైన సూర్యరశ్మి, సేంద్రియ ఎరువులతో కూడిన మట్టి ఉంటే సరిపోతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే జస్ట్ 60 నుంచి 80 రోజుల్లో కాపు వస్తుంది. అయితే వీటిని పెంచేప్పుడు కుండీలో నీరు నిల్వ ఉండకుండా, మట్టిలో తేమ మాత్రమే ఉండేలా జాగ్రత్త వహించాలి.

తక్కువ టైంలో పండించే ఆకు కూరల్లో పాలకూరే ఎప్పుడూ ముందు ఉంటుంది. సరైన వాతావరణం, సంరక్షణ ఉంటే కేవలం 25 నుంచి 30 రోజుల్లోనే ఇది కోతకు వస్తుంది. వీటిని మీరు కుండిల్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అంతేకాదు పాలకూర సాగుకు పెద్ద కుండీలు అవసరం లేదు; మట్టి గుల్లగా ఉండి, మొక్కలకు తగినంత సూర్యరశ్మి అందితే సరిపోతుంది. ఇది త్వరగా చేతికి వస్తుంది. మార్కెట్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కుండి నుంచే మీరు పాలకూరను తీసుకోవచ్చు.

శీతాకాలంలో మంచిగా పెరిగే మరో పంట ముల్లంగి.వీటిని ఇంట్లోనే పెంచడం చాలా సులభం. ఒక కుండిలో మట్టివేసి అందులో నేరుగా ముల్లంగి విత్తనాలు నాటితే సరిపోతుంది.అనుకూలమైన వాతావరణంలో ఉంటే కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే అవి మీకు చేతికి వస్తాయి. అయితే ముల్లంగి భూమి నుంచి లోపలికి వెళ్తుంది కాబట్టి.. కుండీ కాస్త పెద్దగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కుండీ ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి.. అలా అని ఎక్కువ నీరు పోసినా ప్రమాదం.

మీ ఇంట్లో ప్లేస్ కొద్దిగానే ఉంది.. ఆ ప్లేస్‌లోనే ఆకుకూరలను పెంచాలి అనుకుంటే.. మెంతి కూర బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే. దీని విత్తనాలను కుండీలు, గ్రో బ్యాగులు లేదా వెడల్పాటి తొట్లలో సులభంగా చల్లుకోవచ్చు. ఇవి విత్తిన 20 నుంచి 25 రోజుల్లోనే చేతికి వస్తాయి. వీటిని నేరుగా కుండీల్లోంచి తీసుకొని ఆహారాల తయారీలో వాడుకోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు తాజా ఆకులను కోసుకోవచ్చు.

పోషకాలతో పుష్కలంగా నిండి ఉంటే బతువా ఆకుకూరను కూడా ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇందుకోసం ఒక పెద్ద కుండీని తీసుకొని అందులో విత్తనాలు చల్లిన తర్వాత మట్టిలో తేమ పోకుండా చూసుకోవాలి. వాతావరణాన్ని బట్టి కొద్ది వారాల్లోనే దీని ఆకులు వంటలకు సిద్ధమవుతాయి. అప్పుడు మీరు కుండీల్లోంచే నేరుగా తాజా బతువా ఆకులను తెంచుకొని కూరలోకి వాడుకోవచ్చు.