
రక్తహీనత కు చెక్: నేటి కాలంలో చాలామంది, ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. నానబెట్టిన కిస్‌మిస్‌లో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, రక్తాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కిస్‌మిస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. రాత్రంతా ఇవి నీటిలో నానడం వల్ల ఫైబర్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఉదయాన్నే వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి, దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నానబెట్టిన కిస్‌మిస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.

బ్లడ్ ప్రెజర్ నియంత్రణ: ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తనాళాల్లోని ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను సజావుగా సాగేలా చేస్తాయి. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది.

ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు: కిస్‌మిస్‌లో ఉండే బోరాన్ అనే సూక్ష్మపోషకం ఎముకల బలానికి ఎంతో అవసరం. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే, ఇందులోని విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందకోసం ప్రతిరోజూ రాత్రి 8 నుండి 10 కిస్‌మిస్‌లను ఒక గ్లాసు నీటిలో బాగా కడిగి నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఆ కిస్‌మిస్‌లను నమిలి తిని, ఆ నానిన నీటిని కూడా తాగేయాలి.