
నీరు తాగకుండా వెళ్లడం: చాలామంది నిద్రలేవగానే ఏమీ తాగకుండానే వాకింగ్‌కు వెళ్తుంటారు. రాత్రంతా నిద్రపోవడం వల్ల ఉదయం సమయానికి మన శరీరం సహజంగానే కొంత డీహైడ్రేషన్‌కు గురై ఉంటుంది. ఈ స్థితిలో నీళ్లు తాగకుండా నడిస్తే కండరాల తిమ్మిర్లు, తలతిరగడం, తీవ్రమైన అలసట వస్తుంది. వాకింగ్‌కు వెళ్లడానికి 15-20 నిమిషాల ముందే కనీసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి.

వార్మప్: నేరుగా నడక మొదలుపెట్టడం వల్ల కీళ్లు, కండరాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా చలికాలంలో కండరాలు బిగుతుగా ఉంటాయి. వార్మప్ చేయకుండా నడిస్తే గాయాలయ్యే ప్రమాదం ఉంది. నడక ప్రారంభించే ముందు 2 నుండి 5 నిమిషాల పాటు చేతులు, కాళ్లు, మెడను నెమ్మదిగా తిప్పుతూ తేలికపాటి సాగతీత వ్యాయామాలు చేయండి.

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం: తక్షణ శక్తి కోసం చాలామంది నడకకు ముందు కాఫీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ మీకు ఏదైనా తీసుకోవాలనిపిస్తే.. ఒక అరటిపండు లేదా చిన్న అల్పాహారం తీసుకున్న తర్వాతే కాఫీ తాగడం మంచిది.

కాలకృత్యాలు వాయిదా: నడకకు వెళ్లే ఉత్సాహంలో కొందరు టాయిలెట్‌కు వెళ్లడాన్ని వాయిదా వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. దీనివల్ల కడుపులో అసౌకర్యం కలగడమే కాకుండా, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంటి నుండి బయలుదేరే ముందే మీ ఉదయం పనులను పూర్తి చేసుకుంటే నడక హాయిగా సాగుతుంది.

తప్పుడు పాదరక్షలు దుస్తులు: నడకకు తగిన షూస్ ధరించకపోవడం వల్ల పాదాల నొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అలాగే వాతావరణానికి తగినట్లుగా గాలి ఆడే దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.ఆరోగ్యం కోసం చేసే నడక సురక్షితంగా ఉండాలి. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు పూర్తి స్థాయి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.