Health Tips: జిమ్‌కు వెళ్లే పనిలేదు.. రోజు మార్నింగ్ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఆ సమస్యలన్ని మాయం!

Updated on: Jul 12, 2026 | 8:08 PM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో అతి పెద్ద సమస్య 'బరువు పెరగడం. రోజంతా ఒకేచోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తర్వాత బరువు తగ్గడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగాతరు. కానీ మన ఇంట్లోనే తయారు చేసుకునే కీరా దోస, పుదీనా రసం ద్వారా మీరు ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? మీరు డైలీ చేసే వర్కౌట్‌తో పాటు రోజు మార్నింగ్ ఈ జ్యూస్ తాగితే చాలా స్పీడ్‌గా మీలో మార్పు వస్తుంది. అలాగే దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1 / 5
డీటాక్స్: రాత్రి భోజనం చేసిన పడుకున్న తర్వాత మన శరీరంలో హానికరమైన వ్యర్థాలు పేరుకపోయి ఉంటాయి. కాబట్టి మార్నింగ్ మీనే ఈ కీరదోస పుదీనా జ్యూస్ తాగడం వల్ల.. దోసకాయలో ఫైబర్ , పుదీనాలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మీ బాడీని డీటాక్స్ చేస్తాయి. కీరా-పుదీనా రసం మీ లివర్, మూత్రపిండాలు శుభ్రం చేయడంతో పాటు మీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పంపుతుంది. తద్వారా మీ బాడీ మొత్తం క్లీన్ అవుతుంది.

2 / 5
వెయిట్ లాస్: మీరు కనుక అధిక బరువు.. పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతుంటే.. ఈ జ్యూస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగవుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే ఇది తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, ఎక్కువసేపు ఆకలి వేయదు. దీని వల్ల మీరు త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

3 / 5
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్న వారికి ఇదో దివ్వ ఔషదం అనే చెప్పవచ్చు. పుదీనాలో ఉండే మెంతాల్ జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కీరా దోసకాయ ఇచ్చే చలదనం కడుపులో మంట, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ రసం తాగితే కడుపు పూర్తిగా శుభ్రపడుతుంది.

4 / 5
చర్మ సౌందర్యం: చర్మం ఆరోగ్యంగా ఉండటానికి జీర్ణక్రియ బాగుండటం, శరీరానికి తగినంత నీరు అందడం చాలా ముఖ్యం. కాబట్టి డైలీ మార్నింగ్ మీరు కీరదోస పుదీనా రసం తాగడం చాలా మంచిది. కీరా, పుదీనాలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. క్రమం తప్పకుండా ఈ రసం తాగడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

5 / 5
డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది: కీరా దోసకాయలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున ఈ రసం తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. దీనివల్ల మీరు రోజంతా హైడ్రేటెడ్‌గా, తాజాగా ఉంటారు. అలాగే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. అయితే, ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Follow Us