
మెరుగైన హైడ్రేషన్ : కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, సాధారణ నీటి కంటే ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలు శరీరాన్ని ఎక్కువ కాలం హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అందుకే చాలా మంది సమ్మర్ కొబ్బరి నీళ్లు తాగేందుకు ఇష్టపడుతారు.

గుండె ఆరోగ్యం: గుండె ఆరోగ్యం, కండరాల పనితీరు, నరాల సంకేతాల కోసం పొటాషియం చాలా అవసరం. కొబ్బరి నీటిలో ఇది పుష్కలంగా ఉంటుంది. ఒక నెల పాటు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ బాడీలో పొటాషియం లేవర్స్ ఈజీగా పెరుగుతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.

జీర్ణక్రియ: కొబ్బరి నీళ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది కడుపుకు చాలా సున్నితంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది శరీరంలో అసిడిటీని తగ్గించి, జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

స్థిరమైన శక్తి: మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల మాదిరిగా కాకుండా, కొబ్బరి నీళ్లలో సహజమైన చక్కెరలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఇది శరీరానికి లోపలి నుండి తగినంత హైడ్రేషన్ అందినప్పుడు, అది చర్మంపై కనిపిస్తుంది. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

Coconut Water (1)