Mandua Resort: శుభకార్యాలకు వేదికగా మండువా లోగిలి.. యువకుడి ఐడియా అదుర్స్! ఫొటోలు వైరల్‌

Updated on: Nov 27, 2025 | 5:45 PM

పూర్వం మండువా ఇల్లు అంటే ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహ ద్వారమూ, లోపలికి ఆహ్వానించే అరుగూ, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులూ, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు ... ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో..

1 / 5
పూర్వం మండువా ఇల్లు అంటే ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహ ద్వారమూ, లోపలికి ఆహ్వానించే అరుగూ, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులూ, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు ... ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో.

2 / 5
కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే ఈ మండువా లోగిళ్లు ప్రస్తుతం ఈతరం వారి మనసునూ దోచేస్తున్నాయి. కుటుంబ నేపథ్యం, పల్లె అందాల్ని చూపించే సినిమాల్లో కనిపిస్తూ- పాత తరాల జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్న ఈ మండువా లోగిలి... ఇప్పుడు నిజమైన అనుభూతినీ అందిస్తోంది. ఆధునిక నిర్మాణాల్లోనూ భాగమైపోతూ, వేడుకలెన్నింటికో వేదికై అలనాటి స్మృతుల్లోకి తీసుకెళ్తుంది. అయితే నేడు మండువా లోగిలిని మెయింటెన్ చేయలేక కూల్చి వేసి డూప్లెక్స్ బిల్డింగ్‌లు నిర్మించుకుంటున్నారు.

3 / 5
కొమ్ముల బాలు అనే ఇంజినీరింగ్ యువకుడు మాత్రం తన ముత్తాతలు కాలం నాటి లోగిలిని కూల్చడం ఇష్టంలేక 'మా మండువా' అని పేరు పెట్టి నూతన హంగులతో రిసార్ట్స్ నడుపుతున్నాడు. ఇతను చేసిన ప్రయత్నానాన్ని దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులు అభినందిస్తున్నారు.

4 / 5
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలోని దాదాపు 153 ఏళ్లనాటి మండువా లోగిలి అధునాతన హంగులతో నాటి సంప్రదాయాలకు అనుగుణంగా చూడచక్కగా రూపుదిద్దుకుంది. పూర్వకాలం నాటి తిరగల్లు, రుబ్బురోలు, రోకళ్ళు, జాడీలు, మాను పెట్టెలు అక్కడ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాదించే ఔత్సాహికులు అనేకమంది అక్కడి మండువా లోగిలి వీక్షించడమే కాకుండా అందులో వివాహాలు, పలు రకాల ఫంక్షన్లను చక్కగా జరుపుకుంటున్నారు.