Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • మాస్కులు , శానిటైజర్స్ కొరత పై స్పందించిన మానవ హక్కుల కమిషన్. మీడియా కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్చార్సీ. కోవిడ్ వారియర్స్ ఫ్రైంట్ లైన్ వారియర్స్కు సరఫరాలో లోపం పై ఆగ్రహం. పారిశుద్య , ఎంటమాలజీ సిబ్బందికి రక్షణ వస్తువులు ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టిన హెచ్చార్సీ. మాస్కులు , శానిటైజర్ల సరఫరాపై ఈ నెల 28లోగా కమీషన్ ముందు వివరణ ఇవ్వాలని జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆదేశాలు.
  • నిమ్స్ లో కరోనా కలకలం . టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురికి కరోనా పాజిటివ్ . మిల్లినియం బ్లాక్ నుండి ఐటిఎమర్ భవనానికి ల్యాబ్ ని టెస్టుల ప్రక్రియ కోసం మార్చడం తో బాధితులు గా మారుతున్న ల్యాబ్ సిబ్బంది .
  • కర్నూలు: నంద్యాలకు చెందిన బ్యాంక్ ఉద్యోగి కరోనాతో మృతి. మృతి చెందిన వ్యక్తి శిరివెళ్ళ మండలం యర్రగుంట్ల స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం . మృతి చెందిన వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకో గా కరోనా నిర్దారణ. పరిస్థితి విషమంగా ఉండగా కర్నూలు తరలిస్తూండగా కోలుకోలేక మృతి.
  • వరంగల్: నేడు సంపూర్ణ శాకాంబరీగా దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య ఉత్సవాలు. భక్తులు ఎవరూ అమ్మవారికి కూరగాయలు తీసుకురావద్దని విజ్ఞప్తి. నిరాడంబరంగా ఉత్సవాలు.. నేరుగా తోట నుండి కూరగాయలు సేకరించి అమ్మవారిని సంపూర్ణ శాకాంబరీగా అలంకరించిన ఆలయ పూజారులు. సాయంత్రం 8గంటల వరకే దర్శనాలు.
  • చెన్నై మహానగరాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ,వెయ్యి మందికి పైగా మృతి . రాష్ట్రవ్యాప్తం గా 13 జిల్లాలో చెన్నై లోనే కరోనా బాధితుల సంఖ్య వేగం గా పెరుగుతుంది . రోజు వేల సంఖ్యలో కేసులు నమోదుకావడం తో ఇప్పటివరకు 66 వేల 538 మంది కి కరోనా నిర్ధారణ . చెన్నైనగరం లో కరోనా మహమ్మారికి 1 ,033 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడి .
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: 17వేల మార్క్ కు చేరువలో జిహెచ్ఎంసి కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1850. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 22312. జిహెచ్ఎంసి పరిధిలో - 1572. ఈరోజు కరోనా తో చనిపోయిన వారు - 5. టోటల్ డెత్స్ - 288 చికిత్స పొందుతున్న వారు- 10487. డిశ్చార్జి అయిన వారు -11537.

అందాల పాయ‌ల్ శంక‌ర్ సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది..!

Payal Rajput bags a golden opportunity, అందాల పాయ‌ల్ శంక‌ర్ సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది..!

‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీతో టాలీవుడ్ సెన్సేష‌నల్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపింది. బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది‌. అనంతరం వెంకటేశ్, రవితేజ వంటి టాలీవుడ్ టాప్ హీరోల‌ సరసన ఆడిపాడింది. కానీ, అవేమీ ఆమెకు టాప్ హీరోయిన్ గా నిల‌దొక్కుకునేందుకు ఉప‌యోగ‌ప‌డలేదు. అయితే తాజాగా ఈ భామకు సాత్ ఇండియా అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్‌ సినిమాలో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ వ‌ర్గాల స‌మాచారం​.

ప్రస్తుతం శంకర్​.. కమల్‌హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. కాజల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ తదితరులు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనే ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం పాయల్‌ను సంప్రదించిందట మూవీ యూనిట్‌. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ, అందునా క‌మ‌ల్-శంక‌ర్ కాంబినేష‌న్ కాబట్టి ఒకేసారి అటు నార్త్, ఇటు సౌత్ భాషల్లోనూ క్రేజ్‌ దక్కించుకునే అవకాశం పాయల్​కు వరించినట్లవుతుంది. ఈ విషయంపై త్వరలోనే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్​ మూవీలో నటిస్తోంది.

Related Tags