హింసాత్మకంగా మారిన ‘యెల్లో వెస్ట్’ ఉద్యమం

పారిస్‍లో యెల్లో వెస్ట్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఫ్రాన్స్ లో మాక్రాన్ సర్కారుకు వ్యతిరేకంగా…వేలాది మంది నిరసనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే…వారిపైనే దాడులకు దిగారు ఆందోళనకారులు. భారీ సంఖ్యలో చేరిన నిరసనకారులను చెదరగొట్టి వెనక్కి పంపేందుకు పోలీసులు వాటర్‍కేనన్‍లు, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఆందోళనకారుల్లొ కొందరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. కొన్ని చోట్ల షాపులపై దాడులకు దిగారు. మరికొందరు షాపులను లూటీ చేశారు. ఇంకొన్ని […]

హింసాత్మకంగా మారిన 'యెల్లో వెస్ట్' ఉద్యమం
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2019 | 5:23 PM

పారిస్‍లో యెల్లో వెస్ట్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఫ్రాన్స్ లో మాక్రాన్ సర్కారుకు వ్యతిరేకంగా…వేలాది మంది నిరసనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే…వారిపైనే దాడులకు దిగారు ఆందోళనకారులు.

భారీ సంఖ్యలో చేరిన నిరసనకారులను చెదరగొట్టి వెనక్కి పంపేందుకు పోలీసులు వాటర్‍కేనన్‍లు, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఆందోళనకారుల్లొ కొందరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. కొన్ని చోట్ల షాపులపై దాడులకు దిగారు. మరికొందరు షాపులను లూటీ చేశారు. ఇంకొన్ని చోట్ల షాపులకు నిప్పంటించారు.