భారత్‌పై దాయాది కుట్రలు..తప్పని భంగపాటు

Pakistan Asks UN Security Council To Meet Over India's Move In Kashmir

ఆర్టికల్‌ 370 రద్దుని, జమ్మూ కశ్మీర్‌ విభజనను పాకిస్తాన్‌ ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాశ్మీర్‌ అంశంలో రోజుకో దేశాన్ని ఆశ్రయిస్తూ మద్దతు కోరుతూ భంగపడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ మరో మారు ఐరాసను ఆశ్రయించింది. జమ్ముకశ్మీర్‌ అంశంపై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి లేఖ రాసింది. ఈ మేరకు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జొవాన్న రొనెక్కాకు లేఖ రాసినట్లుగా పాక్‌ మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మీద భారత్‌తో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగించేది లేదని తేల్చుకున్నట్లుగా సమాచారం. అంతర్జాతీయ వేదికగా భారత్‌పై విషం చిమ్మేందుకు కుట్రపూరితంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్‌ నుండి భారత రాయబారిని బహిష్కరించి, భారత్ నుండి పాక్‌ రాయబారిని వెనక్కి రప్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *