ఆయిల్ ట్యాంకరు పేలి 20 మంది మృతి!

Over 20 killed in oil tanker explosion in west Uganda, ఆయిల్ ట్యాంకరు పేలి 20 మంది మృతి!

ఉగండా దేశంలో ఆయిల్ ట్యాంకరు పేలడంతో 20 మంది మరణించగా, మరో 12 మంది గాయాల పాలయ్యారు. పశ్చిమ ఉగండా దేశంలోని రుబురిజీ జిల్లా నుంచి ఆయిల్ ట్యాంకరు కెన్యా నుంచి కాంగోకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఆయిల్ ట్యాంకరు డ్రైవరు కంట్రోల్ తప్పి స్టేషనరీ వాహనాన్ని ఢీకొట్టాడు. అంతే ఈ రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకరు పేలింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలతోపాటు సమీపంలోని షాపులు, స్టాళ్లు దగ్థం అయ్యాయి. ఆయిల్ ట్యాంకరు పేలుడు వల్ల 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *