అత్యాచార కేసుల సత్వర నిర్ణయానికి.. వెయ్యి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

అత్యాచార ఘటనలపై ఎలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధుల తీరుపై మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా.. 9 నెలల బాలికపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటనలో సైకో ప్రవీణ్‌కు ఉరివేసిన ఘటన తెలిసిందే. ఇదే మాదిరిగా కోర్టులో.. ఇప్పటికే చాలా అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సత్వర నిర్ణయానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ అక్టోబర్ 2 […]

అత్యాచార కేసుల సత్వర నిర్ణయానికి.. వెయ్యి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 7:19 AM

అత్యాచార ఘటనలపై ఎలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధుల తీరుపై మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా.. 9 నెలల బాలికపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటనలో సైకో ప్రవీణ్‌కు ఉరివేసిన ఘటన తెలిసిందే. ఇదే మాదిరిగా కోర్టులో.. ఇప్పటికే చాలా అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే కొన్ని వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సత్వర నిర్ణయానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రూ.767 కోట్ల బడ్జెట్‌తో దాదాపు 1,023 ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ విభాగం గతంలో ప్రతిపాదించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్భయ ఫండ్ కింద నిధులు కేటాయిస్తుంది.