
భారతదేశం ఎండిపోతోంది. అవును, సరిపడా వానల్లేక బీడుబారిన భూములతో ముప్పావుభాగం భారతదేశం ఎండిపోతోంది. ఒకవైపు నుంచి వికసిత్ భారత్ వైపు మోదీ సర్కార్ పరుగులు పెడుతుంటే, ఇంకోవైపు నుంచి ఎడారి భారతదేశం తప్పదా అని సిగ్నల్స్ ఇస్తోంది ఎల్‌నినో రక్కసి. వాతావరణం తిరగబడుతుందని, నేలను తడపడానిక్కాదు, కనీసం గొంతు తడిచేసుకోడానిక్కూడా నీటిచుక్క దొరకదని ఏడాదిన్నర కిందటే వెదర్‌మ్యాన్‌లు హెచ్చరిస్తూ వస్తున్నారు. రాబోయేది అట్టాంటిట్టాంటి ఎల్‌నినో కాదు, గాడ్జిల్లా ఎల్‌నినో అని చావుకబురు చల్లగా దండోరా వేస్తున్నారు సైంటిస్టులు. మన దేశం ఒక్కటే కాదు.. ఆసియా ఖండం మొత్తాన్నీ వణికిస్తోంది రాకాసి ఎల్‌నినో ప్రభావం. అదిగో అప్పుడే… కరువుకరాళ నృత్యం ఫస్ట్ రౌండ్ కూడా మొదలైపోయింది. తరుముకొచ్చే కరవు రక్కసిని తరిమికొట్టడం ఎలా అని ఎటుచూసినా పరేషాన్లే. అవును.. కరవు కాలం కమింగ్‌సూన్ కాదు. కరువురోజులు వచ్చేశాయి. వాతావరణం వెర్రెక్కిపోయి, వర్షాభావం దాపురించింది. ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బీటలువారుతున్న పంట భూములను చూసి.. బక్కరైతు బిక్కచచ్చిపోతున్నాడు. పంటలు కాపాడుకునేందుకు రైతుల పాట్లు, అగచాట్లు. సాగునీటికే కాదు.. తాగునీటికీ తప్పట్లేదు ఇక్కట్లు. వర్షాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వానదేవుడు మొహం చాటేసి.. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. వేసిన బోర్లలో చుక్క నీరు రాక… తొలకరికి నోచుకోక.. దిగాలు పడ్డ రైతు....