క్రేజీ కాంబో సెట్టైంది.. సెన్సేషనల్ పాత్రలో రౌడీ..?

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో మూవీ షురూ అయ్యింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ విషయంపై తాజాగా తన సోషల్ మీడియాలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు పూరీ. ఇది అధికారికం. పూరీ జగన్నాథ్ తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అంటూ తెలిపారు. ఈ […]

క్రేజీ కాంబో సెట్టైంది.. సెన్సేషనల్ పాత్రలో రౌడీ..?
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 6:08 PM

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో మూవీ షురూ అయ్యింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ విషయంపై తాజాగా తన సోషల్ మీడియాలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు పూరీ.

ఇది అధికారికం. పూరీ జగన్నాథ్ తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అంటూ తెలిపారు. ఈ మేరకు పూరీ, విజయ్ దేవరకొండ, ఛార్మీ తీసుకున్న ఫొటోను షేర్ చేసుకున్నారు.

కాగా టెంపర్ తరువాత పెద్దగా హిట్ లేని పూరీ.. ఇటీవల రామ్ హీరోగా తీసిన ఇస్మార్ట్ శంకర్‌ విజయంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బీ, సీ సెంటర్లలో ఫుల్ కలెక్షన్లను రాబట్టి.. రామ్ కెరీర్‌లో మరో విజయవంతమైన మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అదే ఊపులోి విజయ్ దేవరకొండ కోసం మరో పవర్‌ఫుల్ స్టోరీని రాసుకున్నాడట పూరీ. మరి క్రేజీ కాంబోలో ఎలాంటి సంచలన చిత్రం రాబోతుంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

https://www.instagram.com/p/B1DzkNIAXQ1/?igshid=ht3sa5mfv16w