Viral Video: ఏనుగును ఏనుగుతోనే తరిమి కొట్టిన అధికారులు.. సోషల్ మీడియాలో వైరల్.. అధికారులపై ప్రశంసలు..

|

Jun 15, 2021 | 1:20 AM

Viral Video: అడవిలో జరిగే ప్రతీది మానవులకు ఆశ్చర్యం, ఆసక్తికరం. అడవి మృగాలు, జంతువులు, వాటి వేట, జంతువుల ఆట ఇల రకరకాల...

Viral Video: ఏనుగును ఏనుగుతోనే తరిమి కొట్టిన అధికారులు.. సోషల్ మీడియాలో వైరల్.. అధికారులపై ప్రశంసలు..
Elephant
Follow us on

Viral Video: అడవిలో జరిగే ప్రతీది మానవులకు ఆశ్చర్యం, ఆసక్తికరం. అడవి మృగాలు, జంతువులు, వాటి వేట, జంతువుల ఆట ఇల రకరకాల వీడియోలను సోషల్ మీడియాలోనో.. టీవీల్లోనూ చూస్తుంటాం. అయితే, అటవి ప్రాంతాల నుంచి వచ్చే ఏనుగులతో మానవాళికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అడవుల నుంచి జనజీవన ప్రాంతాల్లో మందలు మందలుగా వస్తున్న ఏనుగులు.. వ్యవసాయ క్షేత్రాలపై పడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఏనుగుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఫారెస్ట్ అధికారులు అద్భుతమైన ఐడియా వేశారు. ముల్లును ముల్లుతోనే తియాలనే చందంగా.. ఏనుగును ఏనుగుతోనే తరమి కొట్టే ఉపాయానికి శ్రీకారం చుట్టారు. ఓ ఏనుగుకు అడవి ఏనుగులను తరిమి కొట్టడంలో శిక్షణ ఇస్తున్నారు. అలా శిక్షణ ఇచ్చిన ఏనుగులతో.. అడవి ఏనుగులను తరిమికొడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ఏనుగుకు శిక్షణ ఇచ్చారు. దానికి కుమ్కి అని పేరు కూడా పెట్టారు.

ఈ కుమ్కి ఆధారంగా అడవి ఏనుగులను జనారణ్యాల నుంచి తరిమి కొడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. తాజాగా ఇలాంటి ఆపరేషన్ చేపట్టారు. అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అయితే రంగంలోకి దిగిన అధికారులు.. ఈ కుమ్కి సహాయంతో అడవిలోకి పారద్రోలారు. ఆ సందర్భంగా ఇతర అధికారులు దానిని వీడియో రికార్డ్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తొలుత ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగూసామి ట్విట్టర్లో షేర్ చేయగా.. ఆ తరువాత మరో ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను షేర్ చేసిన అధికారులు.. వన్యప్రాణుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సుధా రామెన్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

Viral Video:

Also read:

Health Tips: జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాన్ని మీ డైట్‌ చేర్చండి..!