Shocking Video: మన చుట్టూ నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. ఒక్కోసారి మనం చూసింది నిజమేనా అని అనిపించే ఆశ్చర్యకరమైన సంఘటనలూ, దశ్యాలూ ఎదురవుతుంటాయి. అలాంటి నమ్మశక్యం కాని విషయాలు కంటపడటం చాలా అరుదు. అలాంటి షాకింగ్ వీడియోను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాము.
సాధారణంగా చాలా మంది మాకు అంతడబ్బు దొరికితే బాగుండు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోతుందని అనుకుంటుంటారు. అలా అనుకోవడమే ఆలస్యం ఊహించని రీతిలో డబ్బు మీ కళ్ల ముందు కనిపిస్తే.. ఏకంగా ఒక కారు నిండా నోట్ల కట్టలు ఉంటే.. ఆ కారు డోర్ ఓపెన్ చేయగానే వర్షంలా డబ్బుల కట్టలు కింద పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంత భారీ స్థాయిలో డబ్బును చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఔట్ అయిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అలాంటి షాకింగ్ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కారు నిండా డబ్బులు ఉన్నాయి. కారు ముందు అద్దాలు, డోర్ అద్దాల నుంచి ఎటు నుంచి చూసినా డబ్బులే కనిపిస్తున్నాయి. ఓ వ్యక్తి ఆ కారు డోర్‌ను ఓపెన్ చేయడమే ఆలస్యం.. కారు నుంచి డబ్బుల వర్షం కురిసింది. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Also read:
మళ్ళీ సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న హస్తిన…. ఢిల్లీలో 89 కోవిద్ కేసులు…. వారంలో మూడో సారి
Two Wheeler Sales: టూ వీలర్ల విక్రయాల్లో కొత్త రికార్డు… భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి…