కడుపునొప్పితో ఆసుపత్రికొచ్చిన వ్యక్తి.. రిపోర్ట్స్ చూసి ఖంగుతిన్న డాక్టర్లు.. అసలు విషయమేంటంటే?

|

Aug 16, 2021 | 11:48 AM

సాధారణంగా కడుపునొప్పి వస్తే డైజేషన్ సమస్యను అనుకుని వదిలేస్తాం. అదే మరీ ఎక్కువగా వస్తుంటే.. ఓ ట్యాబ్లేట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటాం..

కడుపునొప్పితో ఆసుపత్రికొచ్చిన వ్యక్తి.. రిపోర్ట్స్ చూసి ఖంగుతిన్న డాక్టర్లు.. అసలు విషయమేంటంటే?
Stomach
Follow us on

సాధారణంగా కడుపునొప్పి వస్తే డైజేషన్ సమస్యను అనుకుని వదిలేస్తాం. అదే మరీ ఎక్కువగా వస్తుంటే.. ఓ ట్యాబ్లేట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటాం. అదేపనిగా వస్తుంటే తప్పనిసరిగా డాక్టర్లు దగ్గరకు వెళ్తాం. స్కానింగ్‌లో ఏదైనా కణితిలు లాంటివి తెలిస్తే.. ఆపరేషన్ చేసి తీసేస్తారు. మరి కణితి బదులు కడుపులో పురుగు ఉంటే.? అది కూడా సజీవంగా ఉన్నది అయితే.? వైద్యులు దాన్ని చూసి ఏకంగా ఖంగుతిన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 59 ఏళ్ల ఓ ముసలాయన కడుపులో విపరీతమైన నొప్పి కారణంగా ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్లు అతడికి కొలొనోస్కోపీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. కడుపులో కణితి లేదా పుండు ఉండొచ్చునేమో.. అందుకే నొప్పి వస్తోందని అందరూ భావించారు.

అయితే వారికి షాక్ ఇస్తూ కొలొనోస్కోపీ స్కానింగ్‌లో సజీవంగా ఉన్న ఓ పురుగు బయటపడింది. ఇక ఆ రిపోర్టులను చూసి డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు అది కడుపులోకి ఎలా వెళ్లి ఉండొచ్చునని ఆశ్చర్యపోయారు.! చాలా జాగ్రత్తలు తీసుకుని సుమారు రెండు గంటల ఆపరేషన్ అనంతరం ఆ పురుగును అతడి కడుపు నుంచి డాక్టర్లు బయటికి తీశారు. కాగా, గతంలోనూ ఓ వ్యక్తి కడుపులో బొద్దింక సజీవంగా ఉన్న ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!