Viral Video: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో బంధీలు అయిపోయారు. 2020లో దేశంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజలు ఎన్నడూ లేని కొత్త జీవనాన్ని గడపాల్సి వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తినేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో ఉద్యోగులు ఇంట్లో ఉండే పనులు చక్కబెడుతున్నారు. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా ఓ వ్యక్తి డ్యూటీ చేస్తుండగా.. అది నచ్చని పెంపుడు కుక్క అతనికి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా కడపుబ్బా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
పెంపుడు కుక్కలను యజమానులు ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమలో ఒకరిగా.. తమ కుటుంబ సభ్యుడిగా పెంపుడు కుక్కలను ఆదిరస్తూ దాని ఆలనా పాలనా చూసుకుంటారు. ఆ కుక్కలు అంతే ప్రేమను యజమానుల పట్ల ప్రదర్శిస్తాయి. వారికి ఏ ఆపద వచ్చినా.. వారికి ఏ అవసరం వచ్చినా.. అండగా ఉంటాయి. చాలా కుక్కలు తమ యజమానులతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాయి. వారితో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం బిజీ యుగంలో అది కొంచె కష్టసాధ్యంగా ఉంది.
ఇక అసలే కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా మంది ఇంట్లో ఉండే పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఇంట్లోనే ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాడు. వారికి ఒక పెంపుడు కుక్క ఉంది. తన యజమాని పని చేయడం ఇష్టం లేని ఆ కుక్క.. అతను ల్యాప్‌టాప్ ఓపెన్ చేయనివ్వకుండా అడ్డుకుంది. అతని ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి.. ఆ కుక్క దానిని మూసివేస్తుంది. అలా కాసేపు సరదాగా ఆ కుక్క తన యజమానిని ఆటపట్టించింది. అయితే, ఈ ఘటన అంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 60 వేల మందికి పైగా చూశారు. నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
When your dog knows it’s finally the weekend! pic.twitter.com/kzxN3A1FnZ
— Buitengebieden (@buitengebieden_) June 18, 2021
Also read:
No Mask Countries: కొన్ని దేశాల్లో మాస్కులకు గుడ్ బై.. ‘ఆ’ అయిదు దేశాలేవంటే?