Viral Photo: తన కేర్ టేకర్ ను వాటేసుకున్న గున్న ఏనుగు.. ఫోటో వైరల్!

|

Apr 19, 2021 | 8:28 PM

సాధారణంగా మనం కుక్కలే మనుషులతో కలిసిపోతాయి అనుకుంటాం. కానీ, ఏ జంతువైనా సరే వాటి ఆలనా పాలనా చూసే వారిపట్ల ప్రేమతో వ్యవహరిస్తాయి. మనం ఏడిస్తే అదే మనకి తిరిగి వస్తుందంటారు.

Viral Photo: తన కేర్ టేకర్ ను వాటేసుకున్న గున్న ఏనుగు.. ఫోటో వైరల్!
Viral Photo
Follow us on

Viral Photo: సాధారణంగా మనం కుక్కలే మనుషులతో కలిసిపోతాయి అనుకుంటాం. కానీ, ఏ జంతువైనా సరే వాటి ఆలనా పాలనా చూసే వారిపట్ల ప్రేమతో వ్యవహరిస్తాయి. మనం ఏడిస్తే అదే మనకి తిరిగి వస్తుందంటారు. అలా..ప్రేమగా పెంచిన జంతువు ఏదైనా తిరిగి అది ప్రేమను పంచుతుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. కాకపొతే, పెంపుడు జంతువులుగా కొన్నిటినే మనం చూస్తాం. కానీ, కొంతమంది వృత్తి రీత్యా..కొన్ని జంతువులను పెంచాల్సి వస్తుంది. అయితే, వారు చేసిన సేవను ఆ జంతువులు గుర్తుపడతాయి. తమకు వేళకు ఆహారం ఇచ్చి మంచి చెడ్డలు చూస్తున్న వారి దగ్గర గారాలు పోతాయి. తమ తల్లి దగ్గర ఎలాంటి చేష్టలు చేస్తాయో.. అలానే, తమను సాకుతున్న మనుషుల వద్ద కూడా అవి ప్రవర్తిస్తాయి.

ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. ఒక గున్న ఏనుగు.. తన కేర్ టేకర్ ను ప్రేమగా తొండంతో వాటేసుకుంటోంది ఆ ఫోటోలో. ఈ ఫోటో చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఈ ఫోటో ఇప్పటికే వైరల్ అయింది. తమను ఆదరించిన మనుషుల్ని జంతువులు ఎంత ప్రేమిస్తాయో ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ ఫోటో ఎక్కడ తీశారో చెప్పలేదు. కానీ ఈ ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద పెట్టిన ఈ ఫోటో తీసింది ఆనంద్ షిండే. ఈ ఫోటో షేర్ చేస్తూ సుసాంత నందా..”మనం ఒకరికి ఒకరు కావాలి.” అని క్యాప్షన్ ఇచ్చారు. చక్కటి ఫొటోకు ఇంచక్కటి క్యాప్షన్ ఇచ్చిన ఆయనను కామెంట్లతో ముంచేస్తున్నారు నెటిజన్లు.

Also Read: NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16

America Warning: అమెరికా, రష్యాల మధ్య కొత్త చిచ్చు.. పుతిన్ వైఖరిపై అగ్రరాజ్యం హెచ్చరిక