Viral Video: కిక్కెక్కింది.. ఇల్లు ఎక్కాడు.. మైకేల్ జాక్సన్ మూమెంట్స్‌‌‌‌తో అదరగొట్టాడు.. చివరకు

మందు బాబులు చేసే రచ్చ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.  కిక్కెక్కిందా.. ఎవరిమాట వినరు. ఇక సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మందుబాబుల వీడియోలు

Viral Video: కిక్కెక్కింది.. ఇల్లు ఎక్కాడు.. మైకేల్ జాక్సన్ మూమెంట్స్‌‌‌‌తో అదరగొట్టాడు.. చివరకు
Funny

Updated on: Jul 22, 2021 | 8:13 PM

Viral Video: మందు బాబులు చేసే రచ్చ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.  కిక్కెక్కిందా .. ఎవరిమాట వినరు. ఇక సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మందుబాబుల వీడియోలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కొంతమంది నిషా నషాళానికి ఎక్కితే తమలోని మైకేల్ జాక్సన్ ను బయటకు తీసుకువస్తారు. అదిరిపోయే డాన్స్ లు విచిత్రమైన స్టెప్స్ తో నవ్వు తెపిస్తారు.  మరీ ముఖ్యంగా డీజే ముందు వాళ్లు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఇక తాజాగా అలాంటి ఓ డ్యాన్స్‌ వీడియోనే ఒకటి ఇప్పుడు  సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి తన డ్యాన్స్‌తో నానా హంగామా చేశాడు. అది కూడా ఓ గుడిసె పైకెక్కి. డీజే సౌండ్‌ బీట్‌ దెబ్బకు.. భూమి మీద ఎక్కడ స్థలం లేనట్లుగా ఏకంగా ఓ గుడిసె పైకి ఎక్కి మైకెల్‌ జాక్సన్‌ రేంజ్ లో డ్యాన్స్‌ స్టెప్పులు వేశాడు. ఇక ఇతగాడి రచ్చను చూసిన స్థానిక ప్రజలు.. కిందకు దిగురా సామీ అంటూ బ్రతిమిలాడారు. అయినా వినకుండా ఆ గుడిసె పైనే  బ్రేక్‌ డ్యాన్స్‌ చేశాడు. ఇక చివరికి చేసేదేమి లేక డీజే సాంగ్స్‌ను ఆపేయడంతో కిందకు దిగొచ్చాడు ఈ మందుబాబు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Savitri: తెలుగులోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి వారసుడు.. ఎవరో తెలుసా

Sonu Sood: ‘ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌ను ప్రారంభించబోయేది ఆమే’ .. నువ్వు సూపర్ సోనూ భయ్యా !

Suriya 40 First Look: అదిరిపోయిన సూర్య నయా లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..