చేతి వేళ్లకు అతిపొడవైన గోర్లు పెంచి గిన్నిస్ రికార్డుల్లో(Guinness World Records) చోటు సంపాదించుకున్న ఓ అమ్మడు. అమెరికాలోని మిన్నెసోటా (Minnesota) నగరంలో నివసిస్తున్న డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ అత్యంత పొడవైన వేలుగోళ్లను పెంచి ప్రపంచ రికార్డు నమోదు చేసుకుంది. మహిళల కోసం లిఖించిన ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) చోెటు దక్కించుకున్నట్లుగా మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ 63 63 ఏళ్ల బామ్మ రెండు చేతులకు వేలుగోళ్లు ఉన్న రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఆమె రెండు వేళ్లకు ఉన్న గోళ్ల మొత్తం పొడవు 42 అడుగుల కంటే ఎక్కువ! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందించిన సమాచారం ప్రకారం, డయానా గత 25 సంవత్సరాలుగా తన గోళ్లను పెంచుతోంది.
డయానా తన వేలుగోళ్లను కొలిచినప్పుడు, మొత్తం (అన్ని గోర్లు) పొడవు 42 అడుగుల 10.4 అంగుళాలు. ఈ ఏడాది మార్చిలో ఈ రికార్డు నెలకొల్పింది. 138.94 సెం.మీ. మీ (4 అడుగుల 6.7 అంగుళాలు) పొడవుతో డయానారా, హిప్పో పంజా ఇతర పంజాల కంటే పొడవుగా ఉంటుంది. ఎడమ చూపుడు వేలు గోరు, ఆమె అన్ని వేళ్లలో చిన్నదిగా ఉంది. ఇది అన్ని ఇతర వేళ్ల గోళ్ల కంటే చిన్నది. దీని పొడువు 109.2 సెం.మీ. మీ (3 అడుగులు 7 అంగుళాలు).
డయానా చివరిసారిగా 1997లో తన గోళ్లను కత్తిరించింది. తన కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన కారణంగా తన గోర్లు కత్తిరించడం మానేసిందని డయానా తెలిపింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఆ వివరాలను వెల్లడించారు. 1997 ఆ విధిలేని రోజున డయానాకు ఒక పీడకలగా మిగిలిపోయింది. ఉదయాన్నే తన పిల్లలను నిద్ర లేపి కిరాణా దుకాణానికి వెళ్లి షాపింగ్ చేస్తోంది.
డయానా షాపింగ్ చేస్తుండగా.. రెండో కూతురు కిరిమా భయంతో ఫోన్ చేసింది. ‘అమ్మ, తీషా లేవడం లేదు’ అని చెప్పింది. దీంతో పరుగు.. పరుగునా తాను ఇంటికి వెళ్లే సమయానికే 16 ఏళ్ల కుమార్తె నిద్రలోనే ఆస్తమా వ్యాధితో ఊపిరి అందక మరణించింది. ఇదే తన జీవితంలో అత్యంత చెత్త రోజుగా మిగిలిపోయిందని డయానా చెప్పిందని గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. అయితే అప్పటి వరకు వీకెండ్ సమయంలో డయానా తన గోళ్లను కత్తిరించి పాలిష్ చేసుకునేంది. ఈ ఘటన జరిగిన రోజు నుంచి గోర్లను కత్తిరించడం ఆపేసింది. ఒక్కో గోరును పాలిష్ చేయడానికి కనీసం 4-5 గంటలు పడుతుందని వెల్లడించింది.
New record: Longest fingernails on a pair of hands (female)
Diana Armstrong (USA) has been growing her fingernails for over 25 years and has vowed to never cut them again…https://t.co/c8HTr4oDmd pic.twitter.com/7wnElFOn7M
— Guinness World Records (@GWR) August 2, 2022
గతంలో మహిళల్లో అత్యంత పొడవుగా గోర్లు పెంచిన రికార్డు అమెరికాకు చెందిన అయన్నా విలియమ్స్ పేరిట ఉంది. కానీ ఇప్పుడు అయన్నా వాటిని కత్తిరించారు. ఆమె పేరుతో ఉన్న రికార్డును డయానా విలియమ్స్ బ్రేక్ చేశారు.
మరిన్ని వింతలు-విశేషాల కోసం