Strange Village: ఆశ్చర్యం.. ప్రపంచంలో ఇప్పటి వరకు వర్షం కురియని గ్రామంలో ఎక్కడ ఉందో తెలుసా..?

Strange Village: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కానీ అందరికి తెలియవు. కొన్ని కొన్ని వింతలను చూస్తుంటే ఆశ్యర్యపోకమానరు. అద్భుతాలకు..

Strange Village: ఆశ్చర్యం.. ప్రపంచంలో ఇప్పటి వరకు వర్షం కురియని గ్రామంలో ఎక్కడ ఉందో తెలుసా..?

Strange Village: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కానీ అందరికి తెలియవు. కొన్ని కొన్ని వింతలను చూస్తుంటే ఆశ్యర్యపోకమానరు. అద్భుతాలకు నెలవు ఈ భూమి. రహస్యాల పుట్టిల్లు ఈ పుడమితల్లి. ఓ చోట ఎండలు మండిపోతాయి. మరోచోట చలి వణికిస్తుంది. మరోచోట ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇంకోచోట అస్సలు వర్షమే కురవదు. ఇలా కొన్ని కొన్ని వింటంటే వింతగా ఉంటుంది. అటువంటి ఓ వింత గ్రామం అందరిని ఆశ్చర్యపరుస్తుంది . ఆ గ్రామంలో అస్సలు వర్షమే కురవదు. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామానికి భిన్నంగా అస్సలు ఎప్పుడూ వర్షం పడని ప్రదేశం ఒక‌టుంది. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఇక్కడ వర్షం కురియకపోయినా జనాలు హాయిగా జీవిస్తారు. వర్షమే కురవని ఈ గ్రామానికి పర్యాటకు వస్తుంటారు. ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే గ్రామంలోని వాతావరణం వేడిగా ఉంటుంది. చలి వణికించే శీతాకాలం ఉదయం వాతావరణం చాలా చల్లగా, సూర్యుడు ఉదయించగానే వాతావరణ వేడెక్కిపోతుంది. ఇది ఈ గ్రామ ప్రజలకు అలవాటే. పర్యాటకులకు కూడా అలవాటే. అయిన తరచూ పర్యాటకులు ఈ గ్రామానికి వస్తుంటారు.

ఈ గ్రామంలో పురాతన నిర్మాణాలతో పాటు.. ఆధునిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం ఈ గ్రామం మేఘాలపైన ఉంటుంది. మరి మేఘాల కింద ఉంటేనే కదా వర్షం పడేది. అందుకే ఇక్కడ వర్షం కురియదు. ఈ గ్రామం కింద మేఘాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ గ్రామంలో వ‌ర్షాలు కురియవు. అయితే గ్రామం కిందన వ‌ర్షాలు ప‌డ‌టాన్ని అక్కడ నుంచి చూడవచ్చట. వినడానికి వింతగా ఉంది కదూ. ఈ వింత గ్రామం వర్షాలు పడని గ్రామం.. ఎక్కడా చూడని ప్రత్యేకత ఈ ‘అల్-హుతైబ్’ గ్రామ ప్రత్యేకత.

మరీ ఈ గ్రామానికి నీటి సరఫరా ఎలా..?

వాస్తవానికి యెమెన్‌లో నీటి సమస్య ఎక్కువే. పైగా సనాలో అది మరీ ఎక్కువ. ప్రపంచంలో ‘డ్రై సిటీ’ రాజధాని ఇదొక్కటే. దీంతో సనా మున్సిపల్, వాటర్​ కార్పొరేషన్​ఈ సమస్యలను తీర్చడానికి 2007లో కొత్త పద్ధతులు ఎంచుకుంది. మొబైల్​వాటర్ ట్యాంకర్లతో సిటీ మొత్తం వాటర్​సరఫరా చేస్తోంది. అక్కడ ఎత్తైన గ్రామంగా ఉన్న అల్ హుతైబ్‌కు కూడా మొబైల్​ ట్యాంకులతో పాటు, పైపులతో నీళ్లను అందిస్తోంది. కొండ ప్రాంతంలో పోలాలు ఉంటాయి.

టూరిస్టులను ఆకట్టుకుంటున్న గ్రామం:

కొండపై ఈ గ్రామం ఉండడం వల్ల మేఘాల ప్రయాణం చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వర్షం పడితే కొండపై నుంచి కిందికి వస్తూ వర్షాన్ని తాకొచ్చు. అలాగే కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రజల జీవిన విధానం, ఇళ్ల ఆర్కిటెక్చర్, చేతికందే మేఘాలు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని చూసేందుకు టూరిస్టులు అధికంగా వస్తుంటారట. అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే మొక్కలను ఎక్కువ పండిస్తారు. దీని నుంచి పూలు, మందులు తయారు చేస్తారు. ప్రధాన ఆదాయంగా ‘క్వాట్​ కల్టివేషన్​’ ఈ గ్రామంలో ఉంటుంది. దీనికి సనా వాటర్​కార్పొరేషన్​ ఈ మొక్కల సాగు కోసం 37శాతం నీటిని అల్ హుతైబ్‌కు అందిస్తుంది.

వివిధ కథనాల ప్రకారం.. ‘అల్-హుతైబ్’ గ్రామంలో ఆల్ బోహ్రా లేదా అల్ ముకర్మా ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీలు అంటారు. వారు ముంబైలో నివసించిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతత్వంలోని ఇస్మాయిలీ (ముస్లిం) శాఖ నుండి వచ్చారు. మహమ్మద్ బుర్హానుద్దీన్ 2014 లో మరణించే వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించేవారు. ఇలా ఇప్పటి వరకు వర్షం పడని గ్రామం ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రామం గురించి వింటుంటే వింతగానే ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!

Oil Purify Test: చిన్న ప్రయోగంతో మీ వంటింట్లో ఉండే నూనెలో కల్తీ ఉందో..? లేదో..తెలుసుకోండిలా..?

Railway Track Facts: రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు.. కారణాలు ఏమిటో తెలుసుకోండి..!

BP, Sugar: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? ఏం చేయాలి.. ప్రతి నలుగురిని ఈ రెండు జబ్బులు..!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu