ప్రార్థనా మందిరాల్లో ఇకపై ఇవి ఉండవు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

కరోనా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా జూన్ 8వ తేది నుంచి అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో దర్శనాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రార్థనా మందిరాల్లో ఇకపై ఇవి ఉండవు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 7:20 PM

కరోనా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా జూన్ 8వ తేది నుంచి అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో దర్శనాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు సీఎంలు తమ రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రార్థనా మందిరాల్లో భక్తుల ప్రవేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. దేవాలయాలకు వెళ్లే వారు మాస్క్‌ కచ్చితంగా ధరించాలి. అలాగే 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. ఇక మందిరంలోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లను కచ్చితంగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. విగ్రహాలు, పవిత్ర గ్రంధాలను అస్సలు తాకకూడదు. అలాగే ఇకపై ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం, తీర్థం లాంటివి పంచకూడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాటి వలన కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీటితో పాటు ప్రార్థనా మందిరాల్లో సామూహిక పాటలను పాడటంపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రికార్డు చేసిన పాటలను దేవాలయాల్లో వినిపించాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 25నుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉగాది, గుడ్‌ ఫ్రైడే, శ్రీరామనవమి, రంజాన్ పండుగలను ప్రజలు ఇంట్లోనే నిర్వహించుకున్నారు.

Read This Story Also: మహిళలకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు..!