అక్కడ కశ్మీర్‌పై చర్చజరగలేదు : రాజ్‌నాథ్

కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వర్తిత్వాన్ని భారత్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని స్పష్టం చేసినా.. పాక్ ధోరణి మారలేదు. ఈ సమస్య ద్వైపాక్షిక చర్చలతో పరిష్కారం కాదంటున్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. గడచిన డెబ్బై ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వ్యాఖ్యానించారాయన. మరోవైపు భారత వైఖరిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి గుర్తు చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. డెబ్బై ఏళ్లుగా […]

అక్కడ కశ్మీర్‌పై చర్చజరగలేదు : రాజ్‌నాథ్
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 4:16 PM

కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వర్తిత్వాన్ని భారత్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని స్పష్టం చేసినా.. పాక్ ధోరణి మారలేదు. ఈ సమస్య ద్వైపాక్షిక చర్చలతో పరిష్కారం కాదంటున్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. గడచిన డెబ్బై ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వ్యాఖ్యానించారాయన. మరోవైపు భారత వైఖరిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి గుర్తు చేశారు.

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. డెబ్బై ఏళ్లుగా ఈ అంశంపై భారత్, పాక్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇమ్రాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ సందర్భంగా మళ్లీ తెరమీదికొచ్చింది. కశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని అన్నారు ఇమ్రాన్. ఓ సందర్భంలో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్, వాజ్‌పేయ్ తీర్మానం అంగీకరించారని.. కానీ ఆ తర్వాత రెండు దేశాలు దూరం దూరంగా ఉన్నాయన్నారు. డెబ్బై ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు.

130 కోట్ల మంది ప్రజల కోసం శాంతికి విఘాతం కలిగించే అంశాలను పరిష్కరించుకోవాలన్నారు ఇమ్రాన్. ఇరు దేశాల మధ్య శాంతి కుదిరితే ఆ పరిస్థితులే వేరుగా ఉంటాయని. .భారత్ అణ్వాయుధాలను వదులుకుంటే తామూ అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక చర్చలతో శాంతి అసాధ్యమన్నారు. ఆ పనిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే చేయగలరని అభిప్రాయపడ్డారు.

అయితే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ట్రంప్ వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పందించిన ఆయన.. ఒసాకా సదస్సులో మోదీ, ట్రంప్ మధ్య కశ్మీర్ అంశంపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై ప్రధాని వాస్తవాలను చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్. ఆయనకు విపక్ష సభ్యులు కూడా మద్ధతు పలికారు. దీంతో లోక్‌సభలో వివరణ ఇచ్చారు రాజ్‌నాథ్. కశ్మీర్ సమస్య పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోనే శాంతి సాధ్యమవుతుందని.. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదంటోంది భారత్. కానీ ట్రంప్ మధ్యవర్తితంతోనే సమస్య పరిష్కారమవుతుందంటోంది పాక్. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలతో.. ఇరు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గి రాజేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.