భూటాన్ రథ సారథులు మీరే కావాలి ! విద్యార్థులకు మోదీ పిలుపు

Narendra Modi Addresses Students of Royal University of Bhutan, భూటాన్ రథ సారథులు మీరే కావాలి ! విద్యార్థులకు మోదీ పిలుపు

‘‘మంచి కాలము మించినన్ దొరకదు..అందుకే విద్యార్థి దశలో ఉన్నప్పుడే మీ మెదళ్ళకు పదును పెట్టండి.. మీ దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయండి.. దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళండి’’ అని ప్రధాని మోదీ భూటాన్ లోని విద్యార్థులకు హితవు చెప్పారు. భూటాన్ రాజధాని థింపూ లో రాయల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మీమీద ఈ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని, భారత దేశంలోని వందకోట్ల మందికి పైగా మీ స్నేహితులు (విద్యార్థులు) మిమ్మల్ని ఆదరించేందుకు సిధ్ధంగా ఉన్నారని చెప్పారు. ‘ మీతో వారు చేతులు కలపనున్నారు. తమ అనుభవాలను పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మీ నుంచి ఎన్నో నేర్చుకోవాలని అనుకుంటున్నారు ‘ అని మోదీ పేర్కొన్నారు. భూటాన్ లో రెండో రోజైన ఆదివారం కూడా పర్యటిస్తున్న ఆయన.. ఇక్కడి పిల్లలు నిన్నటి రోజున వీధుల్లో నిలబడి తనకు సాదర స్వాగతం పలకడాన్ని మరచిపోలేనని అన్నారు. వారిలోని ఈ స్పిరిట్ చూసి ఎంతో సంతోషించానని ఆయన పేర్కొన్నారు. భారత, భూటాన్ దేశాలు భౌగోళికంగా, సాంస్కృతికంగా కూడా సాన్నిహిత్యాన్ని కలిగిఉన్నాయని, ఈ దేశాల ప్రజలు [పరస్పర సౌభ్రాత్ర భావంతో మెలగడం హర్షణీయమని మోదీ వ్యాఖ్యానించారు. కాగా-శనివారం మోదీ, భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో 10 ఎం ఓ యు లు కుదుర్చుకున్నారు. థింపూ లోని మంగ్ డెచు హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని మోదీ ప్రారంభించారు. భారత-భూటాన్ దేశాల మధ్య జల విద్యుత్ కు సంబంధించి స్మారక తపాలా బిళ్లలను మోడీ లాంచ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *