మూడు నెలల తర్వాత కివీస్‌లో కరోనా మరణం !

కరోనా వైరస్‌ను కట్టడి చేయడమెలాగో తెలియక దేశాలన్నీ సతమతమవుతుంటే, సంకల్పం ఉంటే సాధించవచ్చని నిరూపిస్తోంది న్యూజిలాండ్.. ప్రధాని జసిండా ఆర్డెన్ నాయకత్వంలో ఆ దేశం కరోనాను చాలా బాగా కంట్రోల్ చేయగలిగింది.

మూడు నెలల తర్వాత కివీస్‌లో కరోనా మరణం !
Follow us

|

Updated on: Sep 04, 2020 | 4:23 PM

కరోనా వైరస్‌ను కట్టడి చేయడమెలాగో తెలియక దేశాలన్నీ సతమతమవుతుంటే, సంకల్పం ఉంటే సాధించవచ్చని నిరూపిస్తోంది న్యూజిలాండ్.. ప్రధాని జసిండా ఆర్డెన్ నాయకత్వంలో ఆ దేశం కరోనాను చాలా బాగా కంట్రోల్ చేయగలిగింది. కరోనాను పూర్తిగా కట్టడి చేసిన దేశంగా రికార్డు కూడా సృష్టించింది.. గత మూడు నెలలుగా ఇక్కడ కేవలం ఒకే ఒక్కరు కరోనాతో మరణించారంటేనే కరోనా నియంత్రణపై ఆ దేశం ఎంత సీరియస్‌గా ఉన్నదో అర్థమవుతోంద.

మే 24 తర్వాత ఇన్నాళ్లకు కోవిడ్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య కేవలం 23 అంటే ఆశ్చర్యం కలగకమానదు. పక్కనే ఉన్న ఆస్ట్రేలియాలో మాత్రం వైరస్‌ తీవ్రత భయంకరంగా ఉంది. విక్టోరియా, మెల్‌బోర్న్‌లలో ఊపేస్తోంది.. న్యూజిలాండ్‌లో కరోనా వ్యాప్తి లేకపోవడానికి కారణం ఆ దేశం తీసుకున్న పకడ్బందీ చర్యలు.. ఇంత చేసినా పోయిన నెల ఆక్లాండ్‌లో మళ్లీ కరోనా వైరస్‌ బయటపడింది. దీన్ని నియంత్రించేందుకు అక్కడ రెండు వారాలకుపైగా లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ ముగుస్తున్న సమయంలోనే యాభై ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడని అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల రెండో వారం వరకు కొనసాగుతుందని ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్‌ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా అప్రమత్తత లెవల్‌-2 గా ప్రకటించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు హెచ్చరించారు.. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు.. ఇంతగా శ్రమిస్తున్నా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందిందనే విషయమే అధికారులకు అంతుపట్టకుండా ఉంది.