దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్… చావుబతుకల మధ్య నిందితుడు..!

విజయవాడలో దివ్య హత్య కేసు సంచలనం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్... చావుబతుకల మధ్య నిందితుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 16, 2020 | 10:15 AM

విజయవాడలో దివ్య హత్య కేసు సంచలనం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబు ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు. కత్తితో పొడుచుకోవడంతో నాగేంద్రబాబు పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే దివ్యకు, తనకు పెళ్లి జరిగిందని నాగేంద్రబాబు ఇప్పటికే పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దాని ఆధారంగా మాచవరం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, దివ్య తేజస్విని అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్య, నాగేంద్రబాబు పెళ్లి చేసుకున్నారని ఇటు నాగేంద్రబాబు సోదరుడు చెబుతుండగా, మా అమ్మాయి ఎవరినీ ప్రేమించలేదని, పెళ్లి చేసుకోలేదని దివ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి చెప్పాడని అతని సోదరుడు చెబుతున్నాడు.

ఇదిలావుంటే, నాగేంద్రబాబుతో ప్రేమ, పెళ్లి విషయాన్ని దివ్య తల్లి ఖండిస్తోంది. బీటెక్‌ చదివిన తన కూతురు పెయింటర్ గా పనిచేసుకునే నాగేంద్ర ఎలాంటి సంబంధంలేదని వాదిస్తోంది. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందనే పుకార్లు పుట్టించ వద్దంటూ వేడుకుంటోంది దివ్య తల్లి. మరోవైపు, వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో దివ్య మెడలో తాళిబొట్టు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం.. ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే.. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.

దివ్యను దారుణంగా చంపిన నాగేంద్రబాబుపై దిశ చట్టం ప్రయోగించి కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నాగేంద్రబాబుపై IPC సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దివ్య ఇంట్లోని కత్తితోనే ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అటు, ఇవాళ దివ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో