ఇజ్రాయెల్ పౌరులకు అదర్శంగా నిలుస్తున్న దేశ ప్రధాని.. తొలి కోవిడ్ టీకా తానే వేయించుకుంటానన్న నెతన్యాహు

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి దాదాపు అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమదేశంలో మొదటి కొవిడ్-19 టీకా శనివారం తానే స్వీకరించనున్నట్లు ప్రకటించారు.

ఇజ్రాయెల్ పౌరులకు అదర్శంగా నిలుస్తున్న దేశ ప్రధాని.. తొలి కోవిడ్ టీకా తానే వేయించుకుంటానన్న నెతన్యాహు
Follow us

|

Updated on: Dec 17, 2020 | 6:34 PM

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి దాదాపు అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమదేశంలో మొదటి కొవిడ్-19 టీకా శనివారం తానే స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తిని కలిసిన నెతన్యాహు సోమవారం నుంచి శుక్రవారం వరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే తానూ కోలుకున్నాక తొలి టీకాను వేయించుకుంటానని వెల్లడించారు.

శుక్రవారం నా క్వారంటైన్ ముగియగానే శనివారం సాయంత్రం కొవిడ్-19 టీకాను వేయించుకుంటాను, ప్రజలందరూ కొవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒప్పించడానికి తాను మొదటి వ్యక్తిగా టీకా తీసుకుంటానని నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. జనవరి నెలాఖరు నాటికి ఇజ్రాయెల్ దేశానికి లక్షలాది మోతాదుల కొవిడ్-19 వ్యాక్సిన్ వస్తుందని, టీకాలు వేయించుకోకుండా ఉండవద్దని నెతన్యాహు ఇజ్రాయెల్ పౌరులకు కోరారు. అయితే, ఫ్రంట్ లైన్ కార్మికులు, వృద్ధులు, రిస్కు గ్రూపుల్లో ఉన్నవారందరికీ ముందుగా కరోనా నిరోధక టీకాలు వేస్తామని నెతన్యాహు వివరించారు. అనంతరం మిగతా పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు.

ఇజ్రాయెల్ దేశీయంగా ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కోసం నవంబరు 1వతేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు, యూఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, జర్మన్ సంస్థ బయోఎంటెక్ ఉత్పత్తి చేసిన కొవిడ్-19కు వ్యతిరేకంగా పనిచేసే వ్యాక్సిన్ గత వారం ఇజ్రాయెల్ చేరింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం 8 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ శనివారం నుంచి వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తామని ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో